CHANDRABABU NAIDU: టార్గెట్ జగన్.. డీకే, చంద్రబాబు రహస్య మంతనాలు..
బెంగళూరులో కర్నాటక డిప్యుటీ సీఎం శివకుమార్‌ను చంద్రబాబు కలిసి మాట్లాడటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

CHANDRABABU NAIDU: ఎన్నికలకు మూడు నెలల ముందే ఏపీలో రాజకీయం సెగలు రేపుతోంది. రెండు ప్రధాన పార్టీలు రేపే ఎన్నికలా అనే రేంజ్‌లో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సిట్టింగ్‌లను మారుస్తూ.. గెలుపు గుర్రాలను వెతికే పనిలో జగన్ ఉంటే.. చంద్రబాబు మాత్రం జగన్‌ను ఓడించేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు. బెంగళూరులో కర్నాటక డిప్యుటీ సీఎం శివకుమార్‌ను చంద్రబాబు కలిసి మాట్లాడటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
YS SHARMILA: బినామీల ఉచ్చులో షర్మిల! నిజమెంత? ఏం జరిగింది ?
నాగ్‌పూర్ సభకు హాజరయ్యేందుకు డీకే శివకుమార్ బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కుప్పం వెళ్తున్న చంద్రబాబు.. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఆగారు. డీకేను చూడగానే స్వయంగా ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడారు చంద్రబాబు. ఇద్దరూ కలిసి పక్కకు వెళ్లి సీక్రెట్‌గా చాలా సేపు మాట్లాడుకున్నారు. వీళ్లిద్దరూ అనుకోకుండా కలిశారా లేక కావాలనే ఇలా మీట్ అయ్యారా అనేది పక్కన పెడితే.. రహస్యంగా ఇద్దరూ మాట్లాడుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. కర్నాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో డీకే కీలక పాత్ర పోషించాడు. ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతలను ఒక్కతాటిమీదకు తీసుకువచ్చి.. అధికార పీఠం మీద కాంగ్రెస్‌ను కూర్చోబెట్టడంలో డీకేదే బిగ్ హ్యాండ్. ఇప్పుడు అదే డీకే ఏపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టబోతున్నారు.
ఇలాంటి టైంలో చంద్రబాబు డీకేను కలవడం ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించడమే ధ్యేయంగా చంద్రబాబు కాయిన్స్ మూవ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో పోలిస్తే ఏపీలో బలంగా మారిన జనసేన పార్టీని ఇప్పటికే తనతో కలుపుకున్నారు చంద్రబాబు. స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి మరీ పవన్‌తో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. ఇక రీసెంట్‌గానే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పీకే టీడీపీ జనసేన కూటమికి వ్యూహకర్తగా వ్యవహరించబోతున్నట్టు టాక్. ఇలాంటి వరుస సంచలనాల నేపథ్యంలో.. ఇప్పుడు డీకేతో చంద్రబాబు రహస్య మంతనాలు జరపడం ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది.