Chandrababu : వాలంటీర్లకు చంద్రబాబు బిస్కెట్లు.. జగనే కరెక్ట్ అని ఒప్పుకున్నారా ?

వాలంటీర్లకు బిస్కెట్ల మీద బిస్కెట్లు వేస్తున్నారు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu). టెక్నాలజీతో వాలంటీర్‌ల జీవితాలు మారుస్తామని ఒకసారి.. 5వేలు కాదు పది వేలకు జీతాలు పెంచుతామని మరోసారి చంద్రబాబు పదేపదే చెప్తూ.. సెల్ఫ్‌గోల్‌ వేసుకుంటున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 9, 2024 | 06:30 PMLast Updated on: Apr 09, 2024 | 6:30 PM

Chandrababu Biscuits For Volunteers Did Jagan Agree That It Is Correct

వాలంటీర్లకు బిస్కెట్ల మీద బిస్కెట్లు వేస్తున్నారు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu). టెక్నాలజీతో వాలంటీర్‌ల జీవితాలు మారుస్తామని ఒకసారి.. 5వేలు కాదు పది వేలకు జీతాలు పెంచుతామని మరోసారి చంద్రబాబు పదేపదే చెప్తూ.. సెల్ఫ్‌గోల్‌ వేసుకుంటున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఒకప్పుడు వాలంటీర్‌ వ్యవస్థ అంటేనే కారాలుమిరియాలు నూరిన చంద్రబాబు.. ఇప్పుడు వాళ్లపై ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే.. వారి గౌరవ వేతనాన్ని 10వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. వాలంటీర్లకు ఉగాది గిఫ్ట్ ప్రకటించారు. ఐతే దీనిపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

తన హయాంలోని జన్మభూమి కమిటీలతో కంపేర్ చేస్తే.. జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థే బెస్ట్ అన్నట్లుగా చంద్రబాబు మాటలు వినిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది సోషల్‌ మీడియాలో ! దీనికి కారణాలు కూడా చూపిస్తున్నారు. పెన్షన్ ఇచ్చేందుకు ఓ మనిషి కావాలా అంటూ.. గతంలో చంద్రబాబు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం అన్నట్లుగా చంద్రబాబు మాటలు వినిపించాయ్ అప్పట్లో… ఇక వాలంటీర్లు విమెన్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారంటూ పవన్ ఘాటు ఆరోపణలు చేశారు. ఇవన్నీ వదిలేస్తే.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని టీడీపీ మీద కోపంతో.. వాలంటీర్లు చాలామంది గంపగుత్తగా రాజీనామా చేశారు.

దీంతో టీడీపీ (TDP) మీద వాలంటీర్లలో మరింత వ్యతిరేకత పెరిగింది. ఇలాంటి సమయంలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. అధికారంలోకి వచ్చాక వాలంటీర్లందర్నీ తిరిగి విధుల్లోకి తీసుకుంటానని.. ఆ ఫైల్ పైనే తొలి సంతకం పెడతానంటూ జగన్ తేల్చి చెప్పడంతో.. చంద్రబాబు జీతాల ప్రస్తావన తీసుకొచ్చారు. మరి దీన్ని జనాలు నమ్ముతారా.. వాలంటీర్ల మనసులను చంద్రబాబు గెలుచుకుంటారా.. చంద్రబాబు జీతం పెంపు మాటలు ఆయుధం అవుతాయా.. లేదంటే బూమరాంగ్ అవుతుందా అన్న చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.