Chandrababu : ఎట్టకేలకు చంద్రబాబు బయటికి.. ఈ ఐదు కండీషన్లతో చంద్రబాబుకు బెయిల్‌

స్కిల్‌ స్కాం కేసులో ఎట్టకేలకు చంద్రబాబుకు ఊరట లభించింది. 52 రోజుల తరువాత ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ లభించింది. 4 వారాల పాటు ఆయనకు బెయిల్‌ ఇస్తూ ఏపీ హైకోర్ట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటే కొన్ని కండీషన్స్‌ను కూడా చంద్రబాబుకు పెట్టింది ఏపీ హైకోర్టు. ఆ కండీషన్స్‌కు లోబడే ఆయన ఈ నాలుగు వారాలపాటు నడుచుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 31, 2023 | 12:18 PMLast Updated on: Oct 31, 2023 | 12:18 PM

Chandrababu Finally Got Relief In The Skill Scam Case

స్కిల్‌ స్కాం కేసులో ఎట్టకేలకు చంద్రబాబుకు ఊరట లభించింది. 52 రోజుల తరువాత ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ లభించింది. 4 వారాల పాటు ఆయనకు బెయిల్‌ ఇస్తూ ఏపీ హైకోర్ట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటే కొన్ని కండీషన్స్‌ను కూడా చంద్రబాబుకు పెట్టింది ఏపీ హైకోర్టు. ఆ కండీషన్స్‌కు లోబడే ఆయన ఈ నాలుగు వారాలపాటు నడుచుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. లక్ష రూపాయల బెయిల్‌ బాండ్‌తో పాటు ఇద్దరు వ్యక్తుల షూరిటీ తీసుకుంది. ఇక చంద్రబాబు తనకు నచ్చిన హాస్పిటల్‌లో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవచ్చని చెప్పింది. చికిత్స వివరాలు, అయిన ఖర్చులు మొత్తం సీల్డ్‌ కవర్‌లో జైల్‌ సూపరింటెండ్‌కు చంద్రబాబు అందించాల్సి ఉంటుంది. కేసు తీవ్రత దృష్ట్యా ఎక్కడా ఈ విషయం గురించి ప్రస్తావించరాదని కండీషన్‌ పెట్టింది. రాజకీయ మీటింగ్‌లు గానీ.. కార్యకర్తలతో ఫోన్‌లో గానీ డైరెక్ట్‌గా గానీ ఈ కేసు గురించి మాట్లాడకూడదంటూ కండీషన్‌ పెట్టింది. ఇక బాబు భద్రత విషయంలో కూడా కీలక అంశాలను ప్రస్తావించింది. చంద్రబాబుకు అనునిత్యం ఇద్దరు డీఎస్పీలతో ఎస్కార్ట్‌ ఇవ్వాలన్న ప్రభుత్వ డిమాండ్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలంటై కోరింది. అదే సమయంలో చంద్రబాబు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీ విషయంలో జోక్యం చేసుకోబోమని..ఇప్పటి వరకు ఎలాంటి సెక్యూరిటీ ఉందో అదే సెక్యూరిటీ కంటిన్యూ చేయాలని చెప్పింది. ఇక నాలుగు వారాల బెయిల్‌ ముగిసిన తరువాత అంటే నవంబర్‌ 28న సాయంత్రం 5 గంటల్లోపు తిరిగి జైల్‌లో సరెండర్‌ కావాలంటూ ఆదేశించింది. 52 రోజుల తరువాత తమ అధినేత జైలు నుంచి విడుదల కాబోతుండటంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది.