CHANDRABABU NAIDU: టికెట్‌ కేటాయింపులో కమ్మ వారికే పెద్దపీట.. చంద్రబాబు బీసీలను నమ్మడం లేదా..?

ఫస్ట్‌ లిస్ట్‌లో సొంత సామాజికవర్గానికే చంద్రబాబు పెద్ద పీట వేసినట్లు కనిపిస్తున్నారు. కమ్మ నేతలకే ఎక్కువ టికెట్లు కేటాయించారు. ఆ సామాజికవర్గంతో కంపేర్‌ చేస్తే.. బీసీలు, మైనారిటీలకు టీడీపీ టికెట్ల కేటాయింపులో మళ్లీ అన్యాయమే చేసినట్లు కనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2024 | 03:46 PMLast Updated on: Feb 24, 2024 | 3:46 PM

Chandrababu Naidu Allotted More Seats To Kamma Community Not To Bc

CHANDRABABU NAIDU: టీడీపీ ఫస్ట్‌ లిస్ట్‌తో సైకిల్ పార్టీలో రచ్చ మొదలైంది. టీడీపీలో అసంతృప్త సెగలు కనిపిస్తున్నాయ్. ముఖ్యంగా పెడన, అనకాపల్లి.. చిత్తూరు జిల్లా పెడనలో తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. తమ నాయకుడికి అన్యాయం జరిగిందని ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. వీళ్ల పంచాయితీ ఎలా ఉన్నా.. టీడీపీ ఫస్ట్ లిస్ట్‌పై బీసీ, మైనారిటీ నేతలు భగ్గుమంటున్నారు. తమకు మళ్లీ అన్యాయమే జరిగిందని పోరాటానికి సిద్ధం అవుతున్నారు.

DELHI LIQOUR SCAM: ముందు కేజ్రీవాల్.. తర్వాత కవిత.. అరెస్టు తప్పదా..?

ఫస్ట్‌ లిస్ట్‌లో సొంత సామాజికవర్గానికే చంద్రబాబు పెద్ద పీట వేసినట్లు కనిపిస్తున్నారు. కమ్మ నేతలకే ఎక్కువ టికెట్లు కేటాయించారు. ఆ సామాజికవర్గంతో కంపేర్‌ చేస్తే.. బీసీలు, మైనారిటీలకు టీడీపీ టికెట్ల కేటాయింపులో మళ్లీ అన్యాయమే చేసినట్లు కనిపిస్తోంది. బీసీలు, మైనారిటీలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారంటూ కొందరు భగ్గుంటున్నారు కూడా! తొలిజాబితాలో 94 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేసిన చంద్రబాబు.. ఏకంగా 21మంది కమ్మ సామాజికవర్గ నేతలకు టికెట్లు ఇచ్చారు. మైనారిటీలకు మాత్రం ఒకే ఒక్క సీటు కేటాయించారు. నంద్యాల నుంచి ఫరాఖ్‌కు మాత్రమే టికెట్ ఇచ్చింది. దీంతో ముస్లీం మైనారిటీల మీద చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతోందన్న చర్చ మొదలైంది. ఇక మైనారిటీల సంగతి అలా ఉంటే.. బీసీలను కూడా చంద్రబాబు నమ్మినట్లు కనిపించ లేదు లిస్ట్ చూస్తే ! 2014 ఎన్నికల్లో బీసీలకు 43 సీట్లు ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు 18కే పరిమితం చేశారు. ఇక అటు కాపులకు కూడా టికెట్ కేటాయింపుల్లో అన్యాయమే జరిగినట్లు కనిపిస్తోంది. ఫస్ట్ లిస్ట్‌లో కేవలం ఏడుగురికి మాత్రమే టికెట్ ఇచ్చారు.

ఇలా కమ్మ నేతలకు ప్రాధాన్యం ఇచ్చి.. మిగిలిన సామాజికవర్గాల విషయంలో చిన్నచూపు చూడడం దారుణం అంటూ చంద్రబాబు మీద కమ్మేతర వర్గాల నేతలు భగ్గుమంటున్నారు. ఏపీ జనాభాలో కమ్మ కులస్థులు 4.5శాతం ఉంటారు. అలాంటిది తొలిజాబితా టికెట్ కేటాయింపుల్లో దాదాపు 20 శాతం వారిదే హవా. దీంతో ఇది తెలుగుదేశం కాదు.. కమ్మదేశం అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది. బీసీలను పక్కనపెట్టి కమ్మలకు ప్రాధాన్యం ఇవ్వడం.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మరో ఆయుధంగా మారే చాన్స్ ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయ్.