CHANDRABABU NAIDU: మా ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది.. జగన్ ఓటమి ఖాయం: చంద్రబాబు
టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం. వాలంటీర్లు వైసీపీ దొంగలకు పనిచేయొద్దు. ఎవరి ఉద్యోగం తీసేయం. వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు న్యాయం చేస్తాం.

CHANDRABABU NAIDU: టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తమ ప్రభుత్వంలోనూ వాలంటీర్లు ఉంటారన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ నిర్వహించిన ‘రా కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ “వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి సిద్ధం. రాష్ట్రంలో పింఛన్ విధానాన్ని ప్రారంభించిందే టీడీపీ ప్రభుత్వం. మేం అధికారంలోకి వచ్చాక ఇంటింటికి వెళ్లి పింఛన్ అందిస్తాం. నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తాం. నేనిచ్చింది ఐటీ ఉద్యోగాలు.
CONGRESS: ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా.. తెలంగాణ రాజకీయాలపై సంచలన సర్వే..
జగన్ ఇచ్చింది వాలంటీర్ ఉద్యోగాలు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం. వాలంటీర్లు వైసీపీ దొంగలకు పనిచేయొద్దు. ఎవరి ఉద్యోగం తీసేయం. వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు న్యాయం చేస్తాం. స్వార్థం కోసం టీడీపీ-జనసేన కలవలేదు. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకునేందుకే కలిశాయి. ఏది అభివృద్ధో..? ఏది దోపిడీనో.. గుర్తించి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలి. సాగునీరు ఇస్తే చాలు.. రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు. అనంతపురం జిల్లా అంటే నాకు ఎంతో ఇష్టం. 2014లో ఈ ప్రాంతం ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది? అనంతపురం జిల్లాలో బిందు, తుంపర సేద్యం మరింత పెరగాలి. కరవు జిల్లాను సస్యశ్యామలం చేయాలని టీడీపీ హయాంలో సంకల్పించాం. మేం అధికారంలో ఉంటే సాగునీరు, పెట్టుబడులు, ఉపాధి పెరిగేవి. గొల్లపల్లి రిజర్వాయర్‌ను 18 నెలల్లో పూర్తి చేశాం. కియా పరిశ్రమ తెచ్చి వేలమందికి ఉపాధి కల్పించాం.
దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. రాయలసీమకు తెచ్చిన పెట్టుబడులు ఏమిటో జగన్ చెప్పాలి. రాయలసీమకు ఏ పార్టీ మేలు చేసిందో ప్రజలు గ్రహించాలి. ఈ ఐదేళ్లలో ఏదైనా ప్రాజెక్టు నిర్మించారా? అభివృద్ధిలో మా పార్టీతో పోల్చుకోవద్దని జగన్‌ను కోరుతున్నాం. వివేకా హత్య కేసులో అనేక పిల్లిమొగ్గలు వేసింది ఎవరు? జాకీ పరిశ్రమ వెళ్లిపోవడానికి కారకులెవరు? మా కార్యకర్తలను వేధించిన వారిపై చర్యలు తప్పవు’’అని చంద్రబాబు అన్నారు.