CHANDRABABU NAIDU: మన రాజధాని అమరావతే.. మోదీ, పవన్‌తో కలిసి అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు

2019 ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ తమాషాలు చేస్తున్నారు. రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు కాదు. అమరావతిని ఎవరూ కూడా ఇక్కడి నుంచి కదల్చలేరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2024 | 06:00 PMLast Updated on: Apr 13, 2024 | 6:00 PM

Chandrababu Naidu Criticised Ap Cm Ys Jagan On 3 Capitals

CHANDRABABU NAIDU: ఏపీ రాజధాని అమరావతే అని.. అలాగే విశాఖపట్న, కర్నూలును కూడా అభివృద్ధి చేస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. “రాష్ట్రం బాగుపడాలంటే జగన్‌ దిగిపోవాలి. రాష్ట్ర ప్రజలకు వైకాపాపై కక్ష తీర్చుకునే అవకాశం వచ్చింది. అమరావతి రాజధాని కోసం వేల మంది రైతులు వేల ఎకరాల భూములు ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం కూడా సహకరించింది.

Bournvita: బోర్న్‌విటాకు కేంద్రం షాక్.. ఆ కేటగిరి నుంచి తీసేయాలని ఆదేశం

ప్రపంచదేశాలన్నీ అమరావతి వైపు చూడాలని, సంపద సృష్టించే కేంద్రంగా తయారుచేయాలని అనుకున్నా. అమరావతిని హైదరాబాద్‌లా డెవలప్ చేద్దామనుకున్నా. విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శ రాజధాని చేయాలనుకున్నా. కానీ, జగన్‌ వచ్చాక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారు. జగన్‌ లాంటి రాక్షసులు వెయ్యి మంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు. 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ తమాషాలు చేస్తున్నారు. ఈ ప్రాంత రైతులు, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు కాదు. నేను, పవన్‌, మోదీ కలిసి అమరావతిని అభివృద్ధి చేస్తాం. ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం. ఉపాధి కోసం ఏపీ యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. అమరావతిని ఎవరూ కూడా ఇక్కడి నుంచి కదల్చలేరు. అసాధ్యాన్ని.. సుసాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా.

ఏపీ రాజధాని అమరావతే. విశాఖపట్నం, కర్నూలును అభివృద్ధి చేస్తాం. గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. రూ.కోట్లు ఖర్చు పెట్టినా జగన్ సభలకు జనం రావడం లేదు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. సీపీఎస్‌ రద్దు చేస్తామన్నారు.. చేశారా? ఉద్యోగులకు పీఆర్‌సీ, డీఏలు ఇవ్వలేదు. వైసీపీ నేతలకు కమిషన్లు ఇవ్వలేక రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయి. జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ అని జగన్ నిరుద్యోగులను మోసం చేశారు. బడికి రంగులు వేస్తే విద్యా వ్యవస్థ మారిపోతుందా? ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పనితో పాలన ప్రారంభిస్తారు. కానీ, రూ. 10కోట్లతో కట్టిన ప్రజావేదిక కూల్చివేసి దుర్మార్గుడు పాలన ప్రారంభించారు. నేను సీఎంగా ఉంటే పోలవరం ఈ పాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తి చేశాక నదుల అనుసంధానం చేద్దామనుకున్నా. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తుంది. జూన్‌ 4న ఇక్కడ విజయోత్సవాలు చేసుకుందాం. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ప్రజల సంబరాలతో పాటు.. జగనాసుర వధ కూడా జరుగుతుంది. జగన్‌ పోవాలి.. ప్రజలు గెలవాలి” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.