Chandrababu Naidu: మూడు నెలల్లో జగన్ ఇంటికే.. విశాఖలోనే 40 వేల కోట్ల కబ్జాలు: చంద్రబాబు

సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగను అన్న వ్యక్తి.. ఇప్పుడు మహిళల భర్తలు, బిడ్డలతో ఏళ్ల తరబడి మద్యం తాగించేందుకు సిద్ధమయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 24, 2023 | 07:03 PMLast Updated on: Dec 24, 2023 | 7:03 PM

Chandrababu Naidu Criticised Ys Jagan In Amaravathi

Chandrababu Naidu: వైఎస్ జగన్ మూడు నెలల్లో ఓడిపోయి, ఇంటికి పోతాడని, అలాంటి వ్యక్తి విశాఖను రాజధాని చేస్తాను అంటున్నాడని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అమరావతిలో ఆదివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు చేశారు.

Ponguleti Srinivasa Reddy: ఆరు గ్యారెంటీల అమలు.. 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ..

“మూడు నెలల్లో ఇంటికి పోయే జగన్ రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తాను అంటున్నాడు. విశాఖలోనే రూ.40 వేల కోట్ల భూ కబ్జాలు జరిగాయి. భూ దందాలన్నీ 22ఏ నిబంధనలు ఉల్లంఘించే జరిగాయి. కోర్టులు చివాట్లు పెట్టినా సీఎం జగన్‌రెడ్డి సిగ్గుపడట్లేదు. అక్రమ కేసులకు భయపడి ప్రజలు బయటకు రాకుంటే, మీ జీవితాలకు మీరే మరణ శాసనం రాసుకున్నట్లు అవుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి. తటస్తులను టీడీపీలోకి వస్తాను అంటే పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. నేను అందరి వాడిని కానీ ఏ ఒక్కడి వాడిని కాదు. ఎక్కడ సమస్యలు ఉంటే నేను అక్కడ ఉంటాను. 40ఏళ్ల అనుభవంతో కష్టపడతా, ప్రజల కష్టాలు తీరుస్తా.

సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగను అన్న వ్యక్తి.. ఇప్పుడు మహిళల భర్తలు, బిడ్డలతో ఏళ్ల తరబడి మద్యం తాగించేందుకు సిద్ధమయ్యారు. ఓటమి భయంతోనే తెలుగుదేశం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాపీ కొట్టి అమలు చేస్తానంటున్నాడు. రాష్ట్రంలో పరిశ్రమలన్నీ పారిపోయాయి. ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. రాబోయే ఎన్నికలు 5కోట్ల మంది ప్రజలకు, జగన్మోహన్ రెడ్డి మధ్య జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వాలు మారినా అభివృద్ధి నిరోధక చర్యలు లేవు. జగన్‌లా విలువలు లేని రాజకీయాలు ఎవ్వరూ చేయలేదు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.