CHANDRABABU NAIDU: ‘బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి’? జగన్‌ను ప్రశ్నించిన చంద్రబాబు

64 రోజుల్లో టీడీపీ- జనసేన ప్రభుత్వం రాబోతోంది. ఈ ఎన్నికలు ఏపీ ప్రజల భవిష్యత్‌ కోసం. ఎన్నికల్లో రాష్ట్రం, ప్రజలు గెలవాలి. ఇలాంటి సైకో సీఎంను జీవితంలో ఎప్పుడూ చూడలేదు. విద్యుత్‌ ఛార్జీలు పెంచి, ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ. 64 వేల కోట్ల భారం మోపారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2024 | 06:29 PMLast Updated on: Feb 05, 2024 | 6:29 PM

Chandrababu Naidu Fires On Ap Cm Ys Jagan In Tdp Meeting

CHANDRABABU NAIDU: ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు మండి పడ్డారు. బటన్‌ నొక్కుడు కాదని, నీ బొక్కుడు సంగతేంటని ప్రశ్నించారు చంద్రబాబు. అనకాపల్లి జిల్లా, మాడుగులలో సోమవారం జరిగిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌పై నిప్పులు చెరిగారు. ‘‘బటన్‌ నొక్కుతున్నానని జగన్‌ గొప్పలు చెబుతున్నాడు. ‘బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి’? రాష్ట్రంలో సైకో పాలన అంతం చేస్తే తప్ప భవిష్యత్‌ లేదు.

JANASENA: పొత్తులో జనసేనకు దక్కబోయే స్థానాలు ఇవేనా..?

64 రోజుల్లో టీడీపీ- జనసేన ప్రభుత్వం రాబోతోంది. ఈ ఎన్నికలు ఏపీ ప్రజల భవిష్యత్‌ కోసం. ఎన్నికల్లో రాష్ట్రం, ప్రజలు గెలవాలి. ఇలాంటి సైకో సీఎంను జీవితంలో ఎప్పుడూ చూడలేదు. విద్యుత్‌ ఛార్జీలు పెంచి, ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ. 64 వేల కోట్ల భారం మోపారు. ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్‌రెడ్డి. చివరకు చెత్తపై కూడా పన్ను వేశారు. జగన్‌ది ఉత్తుత్తి బటన్‌ నొక్కుడు. సీఎం బటన్‌ నొక్కుడుతో ఒక్కో కుటుంబం రూ.8 లక్షలు నష్టపోయింది. రాష్ట్రంలో రోడ్ల బాగు కోసం ఎందుకు బటన్‌ నొక్కలేదు..? జాబ్‌ క్యాలండర్‌కు ఎందుకు జగన్‌ బటన్‌ నొక్కలేదు..? మద్య నిషేధం, సీపీఎస్‌ రద్దుపై బటన్‌ ఎందుకు నొక్కలేదు..? డీఎస్సీ కోసం ఇన్నాళ్లూ ఎందుకు బటన్‌ నొక్కలేదు..? మైనింగ్‌ బటన్‌ నొక్కి భూగర్భ సంపద దోచేశారు. ఇసుక బటన్‌ నొక్కి తాడేపల్లికి సంపద తరలించారు. దోచుకోవడమే తప్ప.. జగన్‌కు ఉత్తరాంధ్రపై ప్రేమ లేదు. విశాఖలో రూ.40 వేల కోట్లు జగన్‌ దోచుకున్నారు.

రుషికొండను జగన్‌ అనకొండలా మింగేశారు. దుయ్యబట్టారు. రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలస్‌ కట్టుకున్నారు. జగన్ బటన్‌ నొక్కుడు డ్రామాలు ప్రజలకు తెలిసిపోయాయి. రేపు ప్రజలంతా ఒకే బటన్‌ నొక్కుతారు. ప్రజలు నొక్కే బటన్‌తో జగన్‌ ఇంటికి వెళ్లడం ఖాయం. ధనదాహంతో జగన్‌ ఉత్తరాంధ్రను ఊడ్చేశారు. జగన్ తన సలహాదారులకు రూ.వందల కోట్లు దోచిపెట్టారు. ఒక్క సజ్జల రామకృష్ణా రెడ్డికే రూ.150 కోట్లు దోచి పెట్టారు. విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విశాఖను గంజాయి కేంద్రంగా.. క్రైమ్‌ సిటీగా మార్చారు. గంజాయి అమ్ముతూ ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో దొరికిపోయారు. జగన్‌రెడ్డి లాంటి సీఎం మనకు అవసరమా?’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.