CHANDRABABU NAIDU: ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు.. జగన్ ఒక బ్లఫ్ మాస్టర్: చంద్రబాబు
25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న హామీ ఏమైంది? మద్యపాన నిషేదం, సీపీఎస్ రద్దు ఏమైంది? హూ కిల్డ్ బాబాయ్.. జగన్‌రెడ్డి జవాబు చెప్పాలి. టీడీపీ-జనసేన కూటమి సభతో తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతోంది.
CHANDRABABU NAIDU: 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ – జనసేన ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. టీడీపీ, జనసేన పొత్తు గురించి వివరించారు. “25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న హామీ ఏమైంది? మద్యపాన నిషేదం, సీపీఎస్ రద్దు ఏమైంది? ఏపీని వైపీసీ సర్కార్ దోపిడీ చేస్తోంది. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని తరిమికొట్టాలి.
PAWAN KALYAN: జగన్ కోటలు బద్ధలు కొడతాం.. టీడీపీ-జనసేనతోనే ప్రజలకు భవిష్యత్: పవన్ కళ్యాణ్
జగన్ ఒక బ్లఫ్ మాస్టర్. అంటే పదేపదే అబద్ధాలు చెప్పడం. చేయని పనులు చేసినట్లు చెప్పుకునే వ్యక్తి జగన్‌రెడ్డి. ఏపీని సర్వనాశనం చేసేలా సీఎం తీరు ఉంది. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను చంపేశారు. వైసీపీ ఆగడాలకు క్రికెటర్ హనుమవిహరి రాష్ట్రాన్ని వదిలి పారిపోయాడు. ఎన్నిలకు ముందు ముద్దులు పెట్టిన జగన్.. ఎన్నికల తర్వాత జర్నలిస్టులపై పిడిగుద్దులు కురిపించాడు. తన పాలన కోసం రాష్ట్రాన్ని, కులాలు, మతాలు, ప్రాంతాలుగా విభజిస్తున్నారు. పేదల కోసం పెట్టిన అన్నా క్యాంటీన్లను మూసివేసిన దుర్మార్గుడు జగన్. ఏపీలో సైకో పాలన నడుస్తోంది. జగన్ తన పాలనలో అందరినీ బాధపెట్టాడు, అవమానించాడు. సినిమా టికెట్ల పేరుతో చిరంజీవి, రాజమౌళిని అవమానించారు. తల్లి, చెల్లిపై కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడంటే.. జగన్ ఎలాంటి వాడో అందరూ అర్థం చేసుకోవాలి. సొంత చెల్లితో జగన్‌కు ఆస్తి, ప్యాలెస్ తగాదాలున్నాయి. హూ కిల్డ్ బాబాయ్.. జగన్‌రెడ్డి జవాబు చెప్పాలి. వై నాట్ 175 అని జగన్ అంటున్నాడు.
వై నాట్ 175 కాదు.. వై నాట్ పులివెందుల అని మేం అంటున్నాం. మనందరిపైన ఓ పవిత్రమైన బాధ్యత ఉంది. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధం. టీడీపీ-జనసేన విజయకేతనం జెండా సభ ఇది. ఏపీని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనేదే మా సంకల్పం. తెలుగు జాతిని ప్రపంచంలోనే నెం.1 స్థానంలో నిలబెట్టడమే మా లక్ష్యం. టీడీపీ-జనసేన కూటమి సభతో తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతోంది. కొండనైనా బద్ధలు చేస్తామనే ధైర్యం టీడీపీ-జనసేన కూటమి ఇస్తుంది. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకొచ్చాం. ప్రపంచదేశాలకు వెళ్లి పరిశ్రమలు తీసుకువచ్చాం. రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్లాం. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పవన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు.
సీనియర్ నాయకుడిగా నేను, ప్రశ్నించే నాయకుడిగా పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని ఇలా చూస్తూ ఉండలేం. 2014లో పోటీ కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని పవన్ కల్యాణ్ ముందుకొచ్చారు. త్వరలో రాష్ట్రానికి నవోదయం. భవిష్యత్‌కు నాంది పలకాల్సిన బాధ్యత మనమై ఉంది. టీడీపీ-జనసేన సైనికులందరికీ నా ధన్యవాదాలు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.