CHANDRABABU NAIDU: ప్రజల కోసం నిలబడ్డ హీరో పవన్.. ఏపీని కాపాడేందుకే కూటమి: చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం. జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్ పారిపోతాడు. రాష్ట్రానికి కేంద్రం మద్దతు అవసరం. కేంద్రం మద్దతుతో శిథిల రాష్ట్రాన్ని గాడిలో పెడతాం.

CHANDRABABU NAIDU: సుఖవంతమైన సినిమా జీవితాన్ని వదులకుని.. ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవన్ కల్యాణ్ అని ప్రశంసించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో బుధవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘విధ్వంస పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలో ప్రజలు ఆలోచించాలి. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి.. అప్పుల పాలు చేశారు.
APPSC Group 2 Results: ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సుఖవంతమైన సినిమా జీవితాన్ని వదులకుని.. ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్ కల్యాణ్. వ్యక్తిగత దాడులు తట్టుకుని పవన్ నిలబడ్డారు. చీకటి పాలన అంతానికి ఓటు చీలకూడదని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదట చెప్పిన వ్యక్తి ఆయనే. 2014లో NDA కూటమి పశ్చిమ గోదావరి జిల్లాలో 15కు 15 సీట్లు గెలవడానికి కారణం పవన్ కల్యాణ్. నాకు అనుభవం ఉంది. పవన్‌కు పవర్ ఉంది. అగ్నికి వాయువు తోడైనట్లు.. ప్రజాగళానికి వారాహి తోడైంది. అహంకారాన్ని బూడిద చేస్తుంది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు కలిసి, కూటమిగా ఏర్పడ్డాయి. సైకిల్ స్పీడ్‌కు తిరుగులేదు. గ్లాస్ జోరుకు ఎదురు లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం. జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్ పారిపోతాడు. రాష్ట్రానికి కేంద్రం మద్దతు అవసరం. కేంద్రం మద్దతుతో శిథిల రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. రైతును రాజుగా చేసే బాధ్యత నాది.
అధికారంలోకి రాగానే ఉపాధి కల్పనపై శ్రద్ధపెడతాం. మెగా డీఎస్సీపైనే మొదటి సంతకం చేస్తా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది. మీ జీతం రూ.5వేల నుంచి 10వేలకు పెంచుతాం. రాజీనామా చేయొద్దు. మీకు అండగా ఉంటాం. మిమ్మల్ని చెడగొట్టాలని జగన్ చూస్తున్నారు. ఇప్పుడు మళ్లీ NDA కూటమిగా కలిసి వచ్చాం. వైసీపీకి డిపాజిట్లు కూడా రాకూడదు. దొంగలు సృష్టించే నకిలీ వార్తలు నమ్మవద్దు. కూటమి తరఫున నిర్దిష్ట అజెండాతో ప్రజల ముందుకు వస్తున్నాం. అధికారం అంటే దోపిడీ అని జగన్ అనుకున్నారు. అందుకే ప్రజల ఆస్తులను దోచేశారు. ప్రతిపక్షాలపై కేసులు, దాడులు చేస్తున్నారు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.