CHANDRABABU NAIDU: చంద్రబాబుకు ఊరట.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చర్యలొద్దని ఆదేశం
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతోపాటు, ఇసుక స్కాం కేసులో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఐడీకి సూచించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

CHANDRABABU NAIDU: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంతోపాటు ఇన్నర్‌రింగ్ రోడ్ స్కాం వంటి పలు కేసులు ఆయన ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే బెయిల్‌పై ఉన్న చంద్రబాబుకు తాజాగా మరోసారి ఊరట లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతోపాటు, ఇసుక స్కాం కేసులో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
Modi Tour : తెలంగాణలో ప్రధాని పర్యటన.. 3 రోజులు, 6 సభలు.. ఈ నియోజకవర్గాల్లో మోదీ రోడ్ షో..
ఈ మేరకు ఏపీ సీఐడీకి సూచించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించేందుకుగాను ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసును ఈనెల 29కి, ఇసుక కేసును ఈనెల 30కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చంద్రబాబుపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశించింది. అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దని ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మద్యం కేసులో ఇప్పటికే చంద్రబాబు తరఫు న్యాయవాదులకు, ప్రభుత్వం లాయర్లకు మధ్య వాదనలు ముగిశాయి. ఈ కేసులో సోమవారం కోర్టు సమయం ముగిసేలోపు రిటర్న్ వాదనలు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి తీర్పు కూడా వెంటనే వెలువడే అవకాశాలున్నాయి.
మొత్తానికి చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం పెండింగ్‌లో ఉన్న కేసులపై హైకోర్టులో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటీషన్‌పై తీర్పు వెలువడాల్సి ఉంది. 17ఏ పైన సుప్రీం తీర్పు సానుకూలంగా వస్తే రాజకీయంగా చంద్రబాబుకు కలిసొస్తుంది. ఈ నెల 30వ తేదీ వరకు సీఐడీ చంద్రబాబు కేసుల విషయంలో తదుపరి చర్యలు వద్దని చెప్పటంతో ఇది ఊరటనిచ్చే అంశంగా మారుతోంది.