తిరుమల లడ్డూలో జంతు కొవ్వు
తిరుమల ప్రసాదం విషయంలో టీడీపీ అధినేత, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. తిరుపతి లడ్డూ ప్రసాదం లో కూడా గత పాలకులు అపవిత్రం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

తిరుమల ప్రసాదం విషయంలో టీడీపీ అధినేత, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. తిరుపతి లడ్డూ ప్రసాదం లో కూడా గత పాలకులు అపవిత్రం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. నాసిరకమైన సరుకులు వాడడమే కాకుండా నేతి బదులు యానిమల్ ఫ్యాట్ (జంతు నూనె) కూడా వాడారని తెలిసిందన్నారు. ఆందోళన చెంది ప్రభుత్వం వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యి ని తెప్పించి వాడుతున్నాం అన్నారు. అన్నదానం విషయంలో కూడా ఇలాంటివే జరిగాయన్న చంద్రబాబు నాయుడు… అన్నదానం నాణ్యత పెంచామని ఇంకా పెంచుతున్నామని పేర్కొన్నారు.