CHANDRABABU NAIDU: 150 సీట్లు మార్చినా వైసీపీ గెలవదు: చంద్రబాబు నాయుడు
జగన్ లెక్కలు తారుమారయ్యాయి. 11 మందికి సీట్లు మార్చేశారు. మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని నేను ఊహించలేదు. ఓ చోట చెల్లని కాసు.. మరో చోట ఎలా చెల్లుబాటు అవుతుంది..? దళితులు.. బీసీలనే బదిలీ చేశారు.
CHANDRABABU NAIDU: గతంలో మాదిరిగా కాకుండా ఈసారి త్వరగానే టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తామని, వైసీపీ 151 సీట్లలో అభ్యర్థుల్ని మార్చినా ఎన్నికల్లో గెలవలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. “జగన్ లెక్కలు తారుమారయ్యాయి. 11 మందికి సీట్లు మార్చేశారు. మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని నేను ఊహించలేదు. ఓ చోట చెల్లని కాసు.. మరో చోట ఎలా చెల్లుబాటు అవుతుంది..? దళితులు.. బీసీలనే బదిలీ చేశారు. బీసీల మీద అంత ప్రేమ ఉంటే అక్కడ బీసీ అభ్యర్థిని నిలపొచ్చు కదా..? ఇంత మందిని బదిలీలు చేసిన జగన్.. బాలినేని, ద్వారంపూడి, పెద్దిరెడ్డి వంటి వారిని ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేయలేదు.
REVANTH REDDY: మొన్న జీవన్ రెడ్డి.. నిన్న మల్లారెడ్డి.. ఎవరినీ వదలని రేవంత్.. బీఆర్ఎస్‌లో టెన్షన్
జగన్ మనుషులు.. బినామీలను ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేయలేదు..? పేదవారి సీట్లే మారుస్తారా? 150 సీట్లు మార్చినా వైసీపీ గెలవదు. ప్రజలను టేకిట్ గ్రాంటెడ్‌గా తీసుకోవడం దారుణం. 5 కోట్ల ప్రజలు వర్సెస్ సైకో జగన్ అనే నినాదంతో ఎన్నికలు జరగనున్నాయి. విన్యాసాలు.. నాటకాలేస్తే వ్రజలు నమ్మరు. ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. నోటిఫికేషన్ వస్తే మరింతగా మార్పు వస్తుంది. అందరి అభిప్రాయాలతో అభ్యర్ధులను నిలబెడతాం. ప్రజలంతా సహకరించాలని కోరుతున్నాం. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి అందరూ సహకరించాలి. మార్పునకు నాంది పలకాలి. వైసీపీ అభ్యర్ధులకు తాడేపల్లి ఆమోదం ఉంటే.. మా అభ్యర్థులకు ప్రజామోదం ఉంటుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి త్వరగానే అభ్యర్థులను ప్రకటిస్తాం. పొత్తులో ఉన్నాం.. సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నాం. ఈసారి అభ్యర్థుల ఎంపిక విధానం వినూత్నంగా ఉండబోతోంది. వైసీపీలోని అసంతృప్తులు మాకెందుకు..?
PAWAN KALYAN: ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లొద్దు.. జనసైనికులకు పవన్ కల్యాణ్ పిలుపు
అక్కడ టిక్కెట్ రాలేదని మా దగ్గరకు వస్తామంటే మాకు అవసరం లేదు. వైసీపీలో మంచి వాళ్లు ఉంటే పార్టీలోకి తీసుకునే అంశంపై ఆలోచన చేస్తాం. మద్య నిషేధం చేయకుంటే ఓటు అడగను అని చెప్పిన జగన్‌కు.. ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఎక్కడిది..? పక్క రాష్ట్రాల్లో ఓటు లేని వారికి.. ఈ రాష్ట్రంలో ఓటు ఉంటే వాళ్లు ఓటేయొద్దని ఎలా చెబుతారు..? ఈ ప్రభుత్వం సవ్యంగా ఉంటే వాళ్లు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్తారు..? జగన్ చేసేవన్నీ చెత్త పనులే. రిషికొండ మీద టూరిజం హోటల్ పేరుతో రూ.500 కోట్లతో భవనం కడతారా..? రిషికొండలో కట్టడాలు కట్టొద్దని చెప్పినా కొండను తవ్వేస్తారా..? చట్టం సీఎంకు వర్తించదా..? జగన్ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండడానికి అర్హులు కారు. మూడు నెలల్లో జగన్ ఇంటికి వెళ్తున్నారు. రాజధాని తరలింపు సాధ్యమా..?ఎలా తరలిస్తారు..? సమయం వచ్చినప్పుడు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.