బాబు ఆదేశాలు, వెంటనే బుడమేరు వద్దకు లోకేష్

బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బుడమేరు కుడి,ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు గురించి అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు లోకేష్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 4, 2024 | 12:25 PMLast Updated on: Sep 04, 2024 | 12:25 PM

Chandrababu Orders To Nara Lokesh

బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బుడమేరు కుడి,ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు గురించి అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు లోకేష్. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గండ్లు పూడ్చివేత పనులను పర్యవేక్షించడానికి బుడమేరు వద్దకు లోకేష్ వెళ్ళారు.

వరద ప్రభావానికి గురైన 36 వార్డుల్లో మంత్రులు, ఎంఎల్ఏ ల ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో మంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపదుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇక ప్రకాశం బ్యారేజి వద్ద భారీగా వరద ఉదృతి తగ్గిపోయింది. ప్రస్తుత ప్రవాహం 4,56,900 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో దెబ్బతిన్న గేట్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.