Ram Gopal Varma: ఇది రక్త చరిత్ర కాదు.. దోమల చరిత్ర చంద్రబాబుపై ఆర్జీవీ ట్వీట్..
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పటి నుంచి వైసీకి మద్దతిచ్చేలా చాలా కామెంట్స్ చేశాడు ఆర్జీవి.

Chandrababu tweeted that the history of RGV mosquitoes on jail
విమర్శలకు వింత వింత ట్వీట్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటే ఆర్జీవి ఎప్పుడు తన ట్వీట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పటి నుంచి వైసీకి మద్దతిచ్చేలా చాలా కామెంట్స్ చేశాడు ఆర్జీవి. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో అందిస్తున్న వసతులు కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్‌గా మారాయి. తనను నార్మల్ ఖైదీలా ట్రీట్ చేస్తున్నారంటూ.. జైల్‌లో తనకు విపరీతంగా దోమలు కుడుతున్నాయంటూ ఏసీబీ జడ్జ్ ముందు చెప్పారు చంద్రబాబు. ఈ విషయం కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేల కూడా ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆర్జీవీ కూడా ఇదే ట్వీట్ చేశాడు.
చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దోమలు నివారించేందుకు ఓ కార్యక్రమం నిర్వహించారు. దోమలపై దండయాత్ర పేరుతో ఏలూరు దోమల నివారణ చర్యలు చేపట్టారు. అప్పుడు చంద్రబాబు మీద దోమలు పగపట్టాయని.. ఆ దోమలే ఇప్పుడు ఆయనను జైల్‌లో కుడుతున్నాయంటూ ఓ ట్వీట్ చేశాడు ఆర్జీవి. ఇది రక్త చరిత్ర కాదు దోమల చరిత్ర అంటూ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాడు. చాన్స్ దొరికితే టీడీపీ మీద సెటైరికల్ ట్వీట్లతో విరుచుకుపడే ఆర్జీవి ఇప్పుడు మరోసారి చంద్రబాబు మీద సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఆర్జీవి చేసిన ట్వీట్ ఇప్పుడు ట్విటర్‌లో వైరల్‌గా మారింది. వైసీపీ కార్యకర్తలు ఆర్జీవీకి సపోర్ట్‌గా కామెంట్లు పెడుతుంటే.. టీడీపీ నేతలు మాత్రం ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.