Chandrababu : రేపు ఢిల్లీకి చంద్రబాబు..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈనెల 27న ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు మాజీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

Chandrababu will go to Delhi tomorrow. Babu Hajar for the wedding reception of lawyer Siddhartha Luthra's son
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈనెల 27న ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు మాజీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఇక సోమవారం రాత్రి ఢిల్లీలోని ఓ హోటల్ లో వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు హాజరుకానున్నారు. తిరిగి మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు.
Revanth Reddy : నేడు రేవంత్ రెడ్డి ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం..
చంద్రబాబుకు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించిన తర్వాత తొలి పర్యటన ఇదే. మరో వైపు మంగళవారం సుప్రీకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాం కేసులో నవంబర్ 20న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ నవంబర్ 21న ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చంద్రబాబు చేసిన స్కాం గురించి.. సాక్ష్యాధారాలు సమర్పించినా సరే తమ వాదన పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టు తమ పరిధిదాటి వ్యవహరించినట్లు ఏపీ సీఐడీ ఆరోపిస్తుంది. ఇక చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.