పుణెలో కూలిపోయింది చంద్రబాబు హెలికాఫ్టర్ ?
పుణెలో హెలికాఫ్టర్ క్రాష్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ముంబై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఈ హెలికాఫ్టర్ పుణెలోని ముల్షీ తాలూకా కోంద్‌వాలేలో ప్రమాదానికి గురైంది.
పుణెలో హెలికాఫ్టర్ క్రాష్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ముంబై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఈ హెలికాఫ్టర్ పుణెలోని ముల్షీ తాలూకా కోంద్‌వాలేలో ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు కో-పైలట్, మరో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. ఐతే ఈ హెలికాఫ్టర్ గురించి బయటికి వచ్చిన ఓ న్యూస్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ హెలికాఫ్టర్‌ను ముంబై నుంచి విజయవాడకు ఏపీ సీఎం చంద్రబాబుకోసం తెప్పిస్తున్నారట. హైదరాబాద్ మీదుగా విజయవాడ వెళ్లాల్సిన క్రమంలోనే హెలికాఫ్టర్‌కు ప్రమాదం జరిగినట్టు సమాచారం. సీఎం చంద్రబాబు ప్రస్తుతం వాడుతున్న హెలికాఫ్టర్‌ను మెయిన్‌టెనెన్స్ కోసం ముంబైకి తరలించారు. కానీ సీఎంకు బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా మరో హెలికాఫ్టర్ పంపించాలంటూ ఏపీ అధికారులు ఏవియేషన్ సంస్థను కోరినట్టు తెలుస్తోంది. అధికారుల ఒత్తిడితో గ్లోబల్ వెక్ట్రా ఏవియేషన్ ఈ హెలికాఫ్టర్‌ను ఏపీకి పంపిందట.
ఈ హెలికాఫ్టర్ హైదరాబాద్ మీదుగా విజయవాడ వెళ్లి. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యుయెల్ నింపుకుని చంద్రబాబు దగ్గరకు వెళ్లాలి. నిజానికి దాదాపు నెల రోజుల నుంచి ముంబైలో ఈ హెలికాఫ్టర్ కూడా మెయిన్‌టేనెన్స్‌లోనే ఉంది. కానీ అధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆగమేఘాల మీద హెలికాఫ్టర్‌ను విజయవాడకు పంపించారు. దురదృష్టవశాత్తూ వాతావరణం హెలికాఫ్టర్ ఫ్లయ్యింగ్‌కు సహకరించలేదు. మహారాష్ట్రతో పాటు ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ అప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. చాలా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది. నిజానికి అలాంటి వెదర్‌లో హెలికాఫ్టర్ ప్రయాణం అంత సురక్షితం కాదు. దానికి తోడు మెయిటేనెన్స్ నుంచి నేరుగా వచ్చిన హెలికాఫ్టర్ కావడంతో గాలి వేగానికి తట్టుకోలేకపోయింది. పుణె శివార్లలో కుప్పకూలిపోయింది.