India As Bharath: భారత్ గా మారిన ఇండియా.. రక్షణ, బ్యాంకింగ్ సైట్లపై దుష్ప్రభావం పడనుందా.. దీనికి ప్రత్యమ్నాయం ఏమిటి..?

ప్రస్తుతం మనదంతా ఆన్లైన్ యుగమే నడుస్తోంది. ఏ సైట్ చూసినా డాట్ ఇన్ అనే అక్షరాలు దర్శనమిస్తాయి. ఇప్పుడు ఇండియా పేరును భారత్ గా మార్చడం వల్ల  కొన్ని సైట్లపై తీవ్ర ప్రభావంపడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రక్షణ, బ్యాంకింగ్ రంగాలపై తీవ్రంగా ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. 

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 6, 2023 | 10:48 AMLast Updated on: Sep 06, 2023 | 10:48 AM

Changing Indias Name To Bharat Will Affect Online Sites

తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్ గా మార్చేసింది. తాజాగా జీ 20 సదస్సులో రాష్ట్రపతి, ప్రధానిలను భారత్ అని సంభోదిస్తూ ఒక ఆహ్వాన పత్రాన్ని పంపించారు. ఇదే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ పేరు మార్చడం వల్ల సమస్యలు ఏంటా అని మీకు ఆశ్చర్యం కలుగవచ్చు. మన దేశంలో దాదాపు చాలా వెబ్ సైట్లు డాట్ కం, డాట్ ఇన్ అని ఉంటాయి. డాట్ ఇన్ అంటే ఇండియా పేరులోని మొదటి రెండు అక్షరాలు అనమాట. ఇప్పుడు ఇండియా కాస్త భారత్ గా మరితే డాట్ ఇన్ ప్లేస్ లో డాట్ బీహెచ్, డాట్ బీఏ రాయాల్సి ఉంటుంది.

గందరగోళ పరిస్థితి ఎందుకు..

సాధారణంగా దీనిని ఇన్ డొమైన్ కంట్రీ కోడ్ టాప్ లేయర్ డొమైన్ (టీఎల్డీ) అంటారు. ఇండియా పేరు కాస్త భారత్ గా మారితే ఈ సైట్లు ఇన్ డొమైన్ తో లాగిన్ అవ్వడం కష్టం అవుతుంది. పైన తెలిపిన బీహెచ్, బీఏ పేర్లు ప్రతిపాదించాలంటే వీటిని గతంలో కొన్ని దేశాలకు కేటాయించడం జరిగింది. దీంతో ఈ అక్షరాలు వచ్చే అవకాశం లేదు. దీంతో ఏదైనా వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తే డాట్ ఇన్ అనే చూపిస్తుంది. దేశం పేరేమో భారత్ అని ఉంటుంది. లింకులో మాత్రం డాట్ ఇని వస్తుంది. అప్పుడు ఈ సైట్ భారతదేశానిదే అని గుర్తించ గలిగే సామర్థ్యం ఎవరికీ ఉండదు. కాస్త గందరగోళ పరిస్థితి తలెత్తుతుంది. పోనీ భారత్ అనే పేరుతో కొత్త డొమైన్ ఏర్పాటు చేసుకుందాం అంటే ప్రస్తుతం అందుబాటులో లేదు.

ఇతర దేశాల డొమైన్లకు దగ్గరగా భారత్..

మన దేశంలో ఎన్ఐఎక్సైస్ సంస్ధ వాళ్లు ఇన్ అనే డొమైన్ ద్వారా రిజిష్టర్ అయి ఉన్నారు. అలాగే జీవోవీ. ఇన్ అనే డొమైన్ ను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉపయోగించుకుంటుంది. ఇక అత్యంత పటిష్టమైన భద్రతా బలగాలకు చెందిన ఆర్మీ సైన్యం కూడా ఎంఐఎల్.ఇన్ అనే డొమైన్ ను ఉఫయోగిస్తుంది. ఒక్కో డొమైన్ లో డాట్ తరువాతి అక్షరాలు ఆ దేశాన్ని గుర్తు చేస్తుంది. ఉదాహరణకు సీఎన్ అనే డొమైన్ చైనాకు, యూఎస్ అనే డొమైన్ అమెరికాకు, యూకే అంటే బ్రిటన్ గా తమ దేశాల గుర్తింపును సూచిస్తున్నాయి. ఇక మారిన భారత్ పేరుతో వచ్చే అక్షరాలు అంటే బీహెచ్, బీఆర్, బీటీ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే బీహెచ్ ను బహ్రెయిన్ దేశానికి కేటాయించగా.. బీఆర్ ను బ్రెజిల్ కు ప్రతిపాదించారు. ఇక బీటీ అంటే భూటాన్ అని అనేక సైట్లు తెరుచుకుంటాయి. ఇప్పుడు ఈ అక్షరాలనే కేటాయిస్తే ఒకే డొమైన్ తో రెండు దేశాలు ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఏవి ఏ దేశానికి సంబంధించిన సైట్లో గుర్తించడం కష్టమవుతుంది. అందుకే భారత్ పేరుకు అనుగుణంగా డాట్ భారత్ అని, డాట్ బీహెచ్ఆర్టీ అని గానీ సరికొత్త డొమైన్ ను తయారుచేసుకోవాల్సి ఉంటుంది.

సైబర్ క్రైం, హ్యాకింగ్ కి గురయ్యే అవకాశం..

ఇప్పటి యుగంలో సాంకేతికతను మంచికి ఎంతగా ఉపయోగిస్తారో చెడుకు కూడా అంతే ఉపయోగిస్తున్నారు. ఇలా చేసే క్రమంలో సైబర్ గాళ్లు వీటిని ఆసరాగా చేసుకొని డేటా చోరీకి పాల్పడే అవకాశం ఉంది. ఒకే పేరుతో డొమైన్లు తెరుచుకోవడం వల్ల ఏది సరైనది అని గుర్తించడం సామాన్యులకు అర్థమయ్యే విషయం కాదు. తద్వారా హ్యాకర్లు, సైబర్ కేటుగాళ్లు అతి సులభంగా డూప్లికేట్ డొమైన్లు ఆయా దేశాల పేరుతో తయారు చేసి కొంత సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉంది. పైగా మన భారత రక్షణ రంగానికి కూడా డాట్ ఇన్ కాస్త వేరే పేరుతో మారిస్తే ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఇదే డొమైన్లు బ్యాంకింగ్ సెక్టార్లపై పడితే అతి సులభంగా నగదును, బ్యాంకు వివరాలను హైడ్ చేసే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇలా పేరు మార్చడం వెనుక ఇంతటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ సైట్లకే పరిమితం అయిన సమస్య రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని రకాల సమస్యలకు దారితీస్తుందో వేచిచూడాలి.

T.V.SRIKAR