భయం భయంగా రాజమండ్రి… ఏమైంది…?
రాజమండ్రిలో చిరుత పులి అక్కడి ప్రజలను కంగారు పెడుతోంది. దాదాపు పులి తిరుగుతుందని తెలిసి వారం కావోస్తున్నా ఇంకా చిరుతపులిని పట్టుకోకపోవడంతో భయాందోళనకు గురువుతున్నారు స్థానికులు.
రాజమండ్రిలో చిరుత పులి అక్కడి ప్రజలను కంగారు పెడుతోంది. దాదాపు పులి తిరుగుతుందని తెలిసి వారం కావోస్తున్నా ఇంకా చిరుతపులిని పట్టుకోకపోవడంతో భయాందోళనకు గురువుతున్నారు స్థానికులు. రాజమండ్రి లాలాచెరువు, దివాన్ చెరువు , రాజానగరం ఫారెస్ట్ లోకి పులి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. తాజాగా నిన్న ట్రాప్ కెమెరాకు మరోసారి చిరుత పులి చిక్కింది.
రెండు రోజులు పాటు వర్షం అడ్డంకి రావడంతో పాదముద్రలు గుర్తించలేకపోయారు ఫారెస్ట్ అధికారులు. ఇప్పటికే 50 ట్రాప్ కెమెరాలతో పాటు… బోన్లను ఏర్పాటు చేసిన ఫారెస్ట్ సిబ్బంది పులి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దీనితో శ్రీరాంపురం.. కలవ గొయ్యి… స్వరూప్ నగర్, బత్తిన నగర్.. లాలాచెరువు , దివాన్ చెరువు, పుష్కర వనం.. ఆటోనగర్.. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.