Shamshabad, Cheetah : శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్ వే పక్కన చిరుత కలకలం…
హైదరాబాద్ శివారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్ వే పక్కన చిరుత ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున చిరుతను పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు.

Cheetah stirs next to the runway of Shamshabad Airport...
హైదరాబాద్ శివారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్ వే పక్కన చిరుత ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున చిరుతను పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంకా రన్ వే పరిసర ప్రాంతంలోనే ఉన్నట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎయిర్పోర్ట్ అథారిటీ సిబ్బంది వైల్డ్ లైఫ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం..
అటవీ శాఖ సిబ్బంది… రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై తిరుగుతున్న చిరుత ఎక్కడకు వెళ్లిందన్న దానిపై అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. చిరుత విమానాశ్రయం పరిసర ప్రాంతంలోనే ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అందుకోసం అటవీ శాఖ సిబ్బంది వెదుకులాట ప్రారంభించారు. ఎయిర్ పోర్టు అథారిటీ ఇటు తమ సిబ్బందిని, అటు ప్రయాణికులను అప్రమత్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SSM