చెన్నై జట్టు చెత్త రికార్డ్, హోంగ్రౌండ్ లో ఘోరపరాభవం

ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ లో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కు 2025 సీజన్ ఏమాత్రం కలిసి రావడం లేదు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు మ్యాచ్ లలో అది కూడా వరుసగా ఓడిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2025 | 07:04 PMLast Updated on: Apr 12, 2025 | 7:04 PM

Chennai Teams Worst Record Heavy Defeat At Home

ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ లో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కు 2025 సీజన్ ఏమాత్రం కలిసి రావడం లేదు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు మ్యాచ్ లలో అది కూడా వరుసగా ఓడిపోయింది. మరీ ముఖ్యంగా సొంతగడ్డపై ఆడిన నాలుగింటిలో మూడుసార్లు పరాజయం పాలైంది. ధోనీ కెప్టెన్ అయిన తర్వాత అయినా పరిస్థితి మారుతుంది అనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురుదైంది. సీఎస్కే చరిత్రలోనే కనీవినీ ఎగురని వైఫల్యాలను ఈ సీజన్‌లో మూటగట్టుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో తొలిసారి చెపాక్ స్టేడియంలో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడింది. చెపాక్ స్టేడియం వేదికగా ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడగా తొలి మ్యాచ్‌లో ముంబై‌పై గెలిచింది.. ఆ తర్వాత అన్నీ ఓటములే. ఆర్సీబీపై 50 పరుగుల తేడాతో ఓడిన సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. కేకేఆర్‌పై దారుణంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలయింది.

18 ఐపీఎల్స్‌లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోయింది. చెపాక్‌లో ఆర్సీబీతో మొదలైన ఓటముల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇలా వరుసగా అన్ని మ్యాచ్‌లు ఓడిపోయింది. అలాగే ఐపీఎల్ చరిత్రలో బంతులు పరంగా ఇదే అతి పెద్ద విజయం. చెన్నై జట్టుపై కోల్‌కతా గెలుపొందాక ఇంకా 59 బంతులు మిగిలి ఉన్నాయి. గతంలో 2020లో ముంబయి ఇండియన్స్ 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు దాన్ని కేకేఆర్ బ్రేక్ చేసింది.

ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. అది కూడా పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌పై నెగ్గింది. ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి మ్యాచ్‌లో అయితే దారుణ పరాభవం పొందింది. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఎంఎస్ ధోనీ బాధ్యతలు తీసుకున్నాడు. ధోనీ కెప్టెన్సీలోనూ సీఎస్కే ఏం మారలేదు. సొంతగడ్డపై స్పిన్‌‌‌‌‌‌‌‌కు అనుకూలించే చెపాక్ వికెట్‌‌‌‌‌‌‌‌పై చెన్నై బ్యాటర్లు బోల్తా కొట్టారు. కేకేఆర్ స్పిన్ త్రయం వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌‌‌‌‌‌‌‌, మొయిన్ అలీని ఎదుర్కోలేక విలవిలలాడారు. ఈ ముగ్గురు బౌలర్లు 12 ఓవర్లలో56 రన్స్ మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టడంతో సీఎస్కే వంద స్కోరు చేసేందుకే ఇక్కట్లు పడింది. ధోనీ టాస్ నెగ్గినా.. ఆటలో మాత్రమే కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే పూర్తి పైచేయి సాధించింది. చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 103 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. ధోనితో సహా జట్టులోని 6 మంది బ్యాటర్లు 6 పరుగులు మాత్రమే జోడించారు.

తొమ్మిదో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రీజులోకి వచ్చిన ధోనీ నాలుగు బాల్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఆడి నరైన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఎల్బీ అయ్యాడు. దీనికి ఓ రివ్యూ కూడా వేస్ట్ చేశాడు. కేకేఆర్ బౌలర్ల దెబ్బకు 9 నుంచి 18 ఓవర్ల మధ్యలో ఒక్క బౌండరీ కూడా రాలేదు. హిట్టర్ శివం దూబే చివరి రెండు ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టడంతో సీఎస్కే అతి కష్టంగా వంద రన్స్‌‌‌‌‌‌‌‌ మార్కు అందుకుంది. కేకేఆర్ జట్టు ఈ స్కోర్‌ను కేవలం 10.1 ఓవర్లలోనే ఛేదించింది.