Chennai Super Kings : చెన్నై అరుదైన రికార్డ్…
టీ ట్వంటీ (T20) క్రికెట్‌లో (Cricket) చెన్నై సూపర్ కింగ్స్ (China Super Kings) అరుదైన ఘనత సాధించింది. అత్యధిక సార్లు 200 ప్లస్ పరుగులు చేసిన చేసిన జట్టుగా సీఎస్‌కే రికార్డులకెక్కింది.

Chennai's rare record...
టీ ట్వంటీ (T20) క్రికెట్‌లో (Cricket) చెన్నై సూపర్ కింగ్స్ (China Super Kings) అరుదైన ఘనత సాధించింది. అత్యధిక సార్లు 200 ప్లస్ పరుగులు చేసిన చేసిన జట్టుగా సీఎస్‌కే రికార్డులకెక్కింది. చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదారాబాద్ (Sunrisers Hyderabad) తో మ్యాచ్‌లో 212 పరుగులు చేయడం ద్వారా చెన్నై ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీ ట్వంటీ క్రికెట్‌లో చెన్నై ఇప్పటివరకు 35 సార్లు 200పైగా పరుగులు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ కౌంటీ జట్టు సోమర్‌సెట్ పేరిట ఉండేది. సోమర్‌సెట్ టీ ట్వంటీల్లో 34 సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించింది. తాజా మ్యాచ్‌తో సోమర్‌సెట్ వరల్డ్ రికార్డును సీఎస్‌కే బ్రేక్ చేసింది.
ఇక అంతర్జాతీయ టీ20 (International T20) క్రికెట్‌లో అయితే ఈ రికార్డు టీమిండియా పేరిట ఉంది. భారత జట్టు 32 సార్లు 200పైగా పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని రుతురాజ్ కోల్పోయాడు. 54 బంతులు ఎదుర్కొన్న 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 98 పరుగులు చేశాడు. అతనితో పాటు డారిల్ మిఛెల్ 52, శివమ్ దూబే 39 పరుగులతో రాణించారు. తర్వాత బౌలర్లు కూడా రాణించడంతో చెన్నై 78 రన్స్ తేడాతో గెలిచింది.