Chilukuru Balaji : గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారా
రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) చిలుకూరు బాలాజీ (Chilukuru Balaji) ఆలయం వైపు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు 10 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) చిలుకూరు బాలాజీ (Chilukuru Balaji) ఆలయం వైపు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు 10 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాజేంద్రనగర్‌లోని కాళీమాత మందిరం నుంచి చిలుకూరు దేవాలయం (Chilukur temple) వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డు కూడా భక్తుల వాహనాలతో నిండిపోయింది. దీంతో ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగులు.. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చినా సిచ్యువేషన్‌ను కంట్రోల్ అవ్వలేదు. ఏ పండగా పర్వదినం ఇలాంటి టైంలో ఈ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇంత మంది భక్తులు ఒకేసారి ఆలయానికి రావడానికి కారణం గరుడ ప్రసాదం. పెళ్లై ఏళ్లు గడిచినా పిల్లలు లేనివాళ్లు గరుడ ప్రసాదం తీసుకుంటే పిల్లలు పుడతారు అనేది చాలా మంది నమ్మకం. అందుకే ఆ ప్రసాదం ఎక్కడ ఇస్తున్నారని తెలిసినా వెంటనే వెళ్లిపోతారు. అలాంటి గరుడ ప్రసాదం చిలుకూరి బాలాజీ ఆలయంలో ఇస్తున్నారన్న వార్త నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. గరుడ ప్రసాదాన్ని ఎక్కువగా నమ్మేవాళ్లు వెంటనే ప్రసాదం తీసుకునేందుకు ఉదయాన్ని ఆలయానికి బయల్దేరారు. కానీ ఆయల అర్చకులు అనుకున్నదానికంటే భారీ సంఖ్యలో భక్తులు రావడంతో.. తెల్లవారుజామున 5 గంటలకు ప్రసాదం పంపిణీ ప్రారంభించి కాసేపటికే ఆపేశారు. ప్రసాదం పంపిణీ ఆగిపోయిందని తెలియని భక్తులు ప్రసాదం కోసం టెంపుల్ వెళ్లారు.
దీంతో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. రాజేంద్రనగర్‌లోని మహంకాళీ ఆలయం నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. గచ్చిబౌలి నుంచి వెళ్లే సర్వీస్ రోడ్డులో కూడా ట్రాఫిక్ బ్లాక్ అయ్యింది. దాదాపు 60 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చినట్టు పోలీసులు చెప్తున్నారు. ప్రసాదం 5 వేల మందికి మాత్రమే ఏర్పాటు చేశారని భక్తులు ఎవరూ ఆలయానికి రావొద్దని పోలీసులు చెప్తున్నారు.