China: 10వేల మీటర్ల బోరుబావి తవ్వుతున్న చైనా.. ఈసారి ఎవరి కొంప ముంచుతుందో..
వింత చేష్టలకు.. వేషాలకు కేరాఫ్‌గా ఉంటుంది చైనా. ప్రపంచానికి పెద్దన్న కావాలన్న కోరికతో.. ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సరిహద్దు దేశాలతో సంబంధాల గురించి సరేసరి ! గిల్లి మరీ పంచాయితీ పెట్టుకుంటుంది డ్రాగన్ కంట్రీ.
ప్రయోగాల పేరుతో పాపిష్టి పనులు చేయడం.. జనాల ప్రాణాల మీదకు తీసుకురావడం.. చైనాకు కొత్తేం కాదు. చేసిన పాపం ప్రతీసారి చైనాను దెబ్బతీస్తున్నా.. డ్రాగన్‌గాళ్ల ఆలోచనలో మార్పు రావడం లేదు. కరోనాను ప్రపంచం మీదకు వదిలి.. ఇప్పుడు అదే కరోనాకు బలి అవుతున్న చైనా.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ బోరు బావి తవ్వేందుకు సిద్ధం అవుతోంది. భూమి పొరల లోతుల్లోకి డ్రిల్లింగ్ మొదలుపెట్టింది. దాదాపు 10వేల కిలోమీటర్ల లోతుకు అంటే.. సుమారు 33వేలకు పైగా ఫీట్ల లోతుకు భారీ రంధ్రం చేస్తోంది చైనా సర్కార్.
జిన్ జియాంగ్ ప్రాంతంలోని గోబీ ఎడారి నుంచి ఈ డ్రిల్లింగ్ ప్రారంభించింది. ఈ ఏడారి నుంచే అంతరిక్షంలోకి మొదటిసారి మనిషిని పంపించింది. పదివేల మీటర్ల లోతుకు చేస్తున్న డ్రిల్లింగ్ పని ప్రభావం… ప్రపంచంలోని దాదాపు అన్ని ఖండాల మీద కనిపిస్తుంది. పది ఖండాల భూభాగాన్ని చీల్చుకుంటూ వెళ్తుందీ డ్రిల్లింగ్. భూభాగంలోని క్రేటేసియస్ పొరను ఆ హోల్ చేరుకుంటుందని చైనా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
అక్కడ సుమారు 14 కోట్ల సంవత్సరాల కిందటి రాళ్లు.. ఆ పొరలో ఉన్నాయని.. వాటికి వెలికితీసేందుకే ఈ ప్రయోగాలు అంటోంది చైనా. భూగర్భ పరిశోధనలు ఉద్ధృతం చేయాలని.. ఈ మధ్యే చైనా అధ్యక్షుడు అక్కడి అధికారులను ఆదేశించారు. భూమి లోపల ఖనిజాలతో పాటు వనరులను గుర్తించాలని అన్నారు. ఇప్పుడు సైంటిస్టులు అదే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు బోర్ హోల్‌లో అతిపెద్ద రంధ్రాన్ని రష్యా తవ్వింది. కోలా సూపర్‌డీప్ అనే బోర్ హోల్.. దాదాపు 12వేల మీటర్ల లోతు ఉంటుంది. అంటే అది దాదాపు 40వేల ఫీట్ల లోతు అన్నమాట. 1989లో దీన్ని తవ్వారు.