జనాభా పెంచేందుకు చైనా కొత్తప్లాన్‌ యువతీ యువకులంతా ఏం చేయాలంటే..

ఏ దేశానికైనా అసలైన సంపద నదులు సముద్రాలు కాదు. ఆ దేశపు యువత. వాళ్లే దేశ భవిశ్యత్తుకు దిశా నిర్దేశకులు. అందుకే ప్రతీ దేశం కూడా వాళ్ల దేశంలో ఉన్న యువతను మరింత మెరుగ్గా చేసుకునే ప్రయత్నం చేస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 29, 2024 | 10:38 PMLast Updated on: Oct 29, 2024 | 10:38 PM

Chinas New Plan To Increase The Population What Should All The Young Men And Women Do

ఏ దేశానికైనా అసలైన సంపద నదులు సముద్రాలు కాదు. ఆ దేశపు యువత. వాళ్లే దేశ భవిశ్యత్తుకు దిశా నిర్దేశకులు. అందుకే ప్రతీ దేశం కూడా వాళ్ల దేశంలో ఉన్న యువతను మరింత మెరుగ్గా చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రస్తుతం చాలా దేశాల్లో యూత్‌ పాపులేషన్‌ తగ్గిపోతోంది. దీనికి కారణం చాలా మంది పెళ్లిళ్లు చేసుకోవడం పిల్లల్ని కనడంలో ఇంట్రెస్ట్‌ చూపించకపోవడం. దీంతో చాలా దేశాల్లో జనాభా తగ్గుతోంది కూడా. ఈ సమస్యను అదిగమించేందుకు చైనా కొత్త పథకాన్ని ఆలోచించింది. పిల్లల్లని ఎక్కువగా కనేవాళ్లకు ఆఫర్లు ప్రకటిస్తోంది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. పాపులేషన్‌లో ఒకప్పుడు చైనానే టాప్‌. ఆ సమయంలో జానాభాను తగ్గించుకునే ప్రయత్నం చేసింది చైనా. కానీ ఇప్పుడు మాత్రం ఆఫర్లు పెట్టి మరీ జనాభాను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

దీనికోసం దేశంలోని పెళ్లైన జంటలకు ఆఫర్లు ఇస్తోంది. చైల్డ్‌ బర్త్‌ ఫ్రెండ్లీ సొసైటీ సృష్టికి చైనా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. చైల్డ్‌ బర్త్‌, చైల్డ్‌ కేర్‌ సర్వీస్‌లను బలోపేతం చేస్తోంది. ఎడ్యుకేషన్‌, హౌసింగ్‌, ఎంప్లాయిమెంట్‌ రంగాల్లో ఆఫర్లు ప్రకటిస్తోంది. ఆర్థికంగా కాస్త వెనకబడి ఉండేవాళ్లు ఎక్కువమంది పిల్లల్ని కనేందుకు పెద్దగా ఇష్టపడరు. ఇలాంటి వాళ్లే ఇప్పుడు చైనా ప్రభుత్వం టార్గెట్‌. పిల్లల్ని ఎక్కువగా కన్నా కూడా .. వాళ్ల జీవితాలు మెరుగ్గా ఉండేలా అక్కడి ప్రభుత్వం కొత్త కొత్త పథకాలు ముందుకు తీసుకువస్తోంది. ఎక్కువ మంది పిల్లలు ఉండి కొత్తగా ఇళ్లు కొనుగోలు చేసేవాళ్లకు దాంట్లో కూడా రాయితీ ప్రకటిస్తోంది. దీంతో ఎలాంటి భయం లేకుండా అంతా పిల్లల్ని ఎక్కువగా కంటారు అనేది చైనా లాగిక్‌. ఒకప్పుడు జనాభాను కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నించిన చైనా ఇప్పుడు అదే జనాభా పెంచేందుకు ఆఫర్లు ప్రకటించిడం హాట్‌ టాపిక్‌గా మారింది. చైనా చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత వరకూ సక్సెస్‌ అవుతుందో చూడాలి.