CHIRANJEEVI: పవన్ కోసం మెగా ఫ్యామిలీ కదలబోతోందా..?
మెగా ఫ్యామిలీ నుంచి పవన్ తరఫున ఎవరైనా ప్రచారం చేస్తారా అన్న దానిపై ఓ స్పష్టత వచ్చింది. చిరు అయితే రారు. అది మాత్రం కన్పార్మ్ అయింది. ఐతే జనసేన తరపున పవన్ అన్నీ తానై తిరుగుతున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారు.

CHIRANJEEVI: జనసేన అధినేత పవన్‌ను మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వదించారు. 5 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. ఆ చెక్ అందించిన తర్వాత.. చిరు ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ వినియోగించటం సంతోషాన్ని కలిగించిన విషయమని.. స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడి లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని.. తాను సైతం అంటూ 5కోట్లు అందించారు చిరు.
CHIRANJEEVI-PAWAN KALYAN: తమ్ముడి కోసం అన్న.. పవన్‌కు చిరు మెగా విరాళం.. ఫొటోలు..
జనసేనకు కాదు.. తమ్ముడికి అన్నలా మాత్రమే సాయంగా ఉంటానని.. చెప్పకనే చెప్పాడు చిరు. ఆర్థికసాయం అన్నలా మాత్రమే అందించానని.. రాజకీయాల కోసం కాదు అని క్లారిటీ ఇచ్చారు. ఐతే మెగా ఫ్యామిలీ నుంచి పవన్ తరఫున ఎవరైనా ప్రచారం చేస్తారా అన్న దానిపై ఓ స్పష్టత వచ్చింది. చిరు అయితే రారు. అది మాత్రం కన్పార్మ్ అయింది. ఐతే జనసేన తరపున పవన్ అన్నీ తానై తిరుగుతున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారు. వారంరోజుల గ్యాప్‌లో రెండుసార్లు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ కదిలి రావడం ఖాయమా అనే చర్చ మళ్లీ మొదలైంది. మెగా కుటుంబంలో దాదాపు ఆరేడు మంది హీరోలున్నారు. వారిలో మెగాస్టార్‌ను పక్కన పెడితే.. నాగబాబు ఇప్పటికే జనసేన నేతల్లో ఒకరిగా ఉన్నారు. మిగిలిన యువ హీరోలు ఈసారి ప్రచారానికి వస్తారా..? గత ఎన్నికల్లో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి వారు వచ్చి భీమవరం, గాజువాకలో ప్రచారం చేసి వెళ్లారు.
ఐతే ఈసారి వారితో పాటు అల్లు అర్జున్ కూడా వస్తారా.. లేదా.. అన్నది కూడా ఆసక్తికరంగానే ఉంది. అల్లు కుటుంబం కూడా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సినీ హీరోలే. మెగా ఫ్యాన్స్ వారికి అభిమానులుగా మారారు. పవన్ ఆదేశిస్తే.. పార్టీ కోసం ఏం చేయడానికైనా సిద్ధం అని.. అల్లు అర్జున్‌తో సహా మెగా హీరోలు చాలాసార్లు అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ వారిని పిలుస్తారా.. వాళ్లు వస్తారా.. జనాల్లో హీరోలు కనిపిస్తారా అనే చర్చ జోరుగా వినిపిస్తోంది.