CHIRANJEEVI-PAWAN KALYAN: మెగా విరాళం.. జనసేనకు మెగాస్టార్ రూ.5 కోట్లు విరాళం
పవన్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు చిరంజీవి. ఆ తర్వాత జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయలను చిరంజీవి విరాళంగా ఇచ్చినట్టు తెలిసింది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కోసం చాలావరకూ తన సొంత డబ్బులనే విరాళంగా ఇస్తున్నారు.

CHIRANJEEVI-PAWAN KALYAN: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. విశ్వంభర మూవీ షూటింగ్‌లో ఉన్న మెగాస్టార్‌ను కలుసుకున్నారు పవన్ కల్యాణ్. ఎన్నికల ప్రచారంలో అస్వస్థులై.. హైదరాబాద్‌లో రెస్ట్ తీసుకుంటున్న పవన్ ఆరోగ్యం గురించి చిరంజీవి ఆరా తీశారు. తమ్ముడి పార్టీ కోసం అన్న మెగా విరాళాన్ని అందించారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ విశ్వంభర సినిమా షూటింగ్ పోచంపల్లి ఏరియాలో జరుగుతోంది.
PUSHPA 2: చీర, బొట్టు, కాలికి గజ్జెలు.. గంగమ్మ జాతర పూనకాలు..
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్స్‌లో జరుగుతున్న షూటింగ్‌లో మెగాస్టర్ చిరంజీవి పాల్గొంటున్నారు. అయితే ఆదివారం నాడు అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేనాని పవన్ కల్యాణ్ ఎండ వేడి తట్టుకోలేక అస్వస్థులయ్యారు. జ్వరం రావడంతో డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అందుకోసం హైదరాబాద్‌కి వచ్చాడు పవన్. పోచంపల్లిలో విశ్వంభర మూవీ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. మెగా బ్రదర్స్ ఇద్దరూ కాసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. పవన్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు చిరంజీవి. ఆ తర్వాత జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయలను చిరంజీవి విరాళంగా ఇచ్చినట్టు తెలిసింది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కోసం చాలావరకూ తన సొంత డబ్బులనే విరాళంగా ఇస్తున్నారు. తాను సినిమాల్లో నటించడం ద్వారా వచ్చిన డబ్బుల్లో.. 10 కోట్ల రూపాయలను ఈమధ్యే జనసేన పార్టీకి ఇచ్చారు. మెగా హీరోలు కూడా తన చేతనంత సాయం చేస్తున్నారు. జనసేన కౌలు రైతుల సంక్షేమ నిధికి చిరు, పవన్ తల్లి అంజనా దేవి లక్షన్నర రూపాయలు విరాళంగా ఇచ్చారు.
నాగబాబు కొడుకు హీరో వరుణ్ తేజ్ 10 లక్షలు, మేనల్లుడు సాయి ధర్మ్ తేజ్ 10 లక్షలు, వైష్ణవ్ తేజ్, నిహారిక చెరో 5 లక్షల రూపాయలను జనసేనకు విరాళంగా ఇచ్చారు. ఆరెంజ్ మూవీ రీరిలీజ్ కలెక్షన్లను కూడా పార్టీకి విరాళంగా ఇచ్చారు. మెగా బ్రదర్స్‌లో పవన్ కల్యాణ్, నాగబాబు మాత్రమే యాక్టివ్‌గా జనసేన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అయినప్పటికీ.. మెగా హీరోలంతా పవన్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. మిగతా వాళ్ళెవర్నీ డైరెక్ట్ పాలిటిక్స్‌లోకి రావొద్దని పవన్ కల్యాణ్ చెప్పినట్టు సమాచారం. కానీ పవన్ పిలిస్తే ఎప్పుడైనా… ఎక్కడికైనా ప్రచారానికి సిద్ధమని మెగా హీరోలు అప్పుడప్పుడు స్టేట్‌మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా అయినా పవన్ కల్యాణ్‌కు, జనసేనకు మెగాస్టార్ చిరంజీవితో పాటు మిగతా హీరోలు మద్దతుగా నిలుస్తున్నారు.