Chiranjeevi : ఫైనల్లీ కుండబద్దలు కొట్టేసారు
మెగాస్టార్ ముసుగు తొలగించుకున్నారు. ఇన్నాళ్లు తనది ఏ పార్టీయో, తను ఏ పార్టీకి అనుకూలమో చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేసిన చిరు.. ఫైనల్లీ కుండబద్దలు కొట్టేసారు. తన పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటో.. తన సపోర్ట్ ఎవరికో క్లారిటీ ఇచ్చేశారు.

Chiranjeevi has made it clear that he is not affiliated with any political party.
మెగాస్టార్ ముసుగు తొలగించుకున్నారు. ఇన్నాళ్లు తనది ఏ పార్టీయో, తను ఏ పార్టీకి అనుకూలమో చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేసిన చిరు.. ఫైనల్లీ కుండబద్దలు కొట్టేసారు. తన పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటో.. తన సపోర్ట్ ఎవరికో క్లారిటీ ఇచ్చేశారు.
మెగాస్టార్ చిరంజీవి .. తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ ఇంట్రడక్షన్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. సినీ రంగంలో అంచలంచెలుగా అగ్రస్థానానికి ఎదిగి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకోవడమే కాదు.. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి,స్వయంగా రాజకీయ పార్టీని పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఎంత స్పీడ్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారో అంతే స్పీడ్ గా వెనక్కి వచ్చారు. దాదాపు దశాబ్ద కాలంగా మెగాస్టార్ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.. కానీ ఎప్పటికప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి .చిరు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని.. ఏదో ఒక పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతూనే ఉంది.. కానీ తాజాగా ఆయన ఈ ఊహగానాలకు చెక్ పెట్టేశారు.
చిరంజీవి 2008లో ఆగస్టు 26వ తేదీన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. తర్వాత అనూహ్య పరిణామాల్లో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దానికి ప్రతిఫలంగా కేంద్ర మంత్రి పదవిని పొందిన ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీకి కూడా దూరమైపోయారు. కాంగ్రెస్ చిరంజీవి తమ పార్టీలోనే ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చింది కానీ ఆయన మాత్రం పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు కనపడలేదు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన తర్వాత మెగాస్టార్ ఆ పార్టీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన ఎప్పుడూ ఆ పార్టీకి దగ్గరగా వెళ్లలేదు. కరోనా సమయంలో వైసీపీలో చేరతారని, ఆయనకు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ పదవి ఇవ్వబోతుందన్న ప్రచారం కూడా జరిగింది కానీ అది కూడా జరగలేదు. ఆ తర్వాత ఒకటి రెండుసార్లు ప్రధాని మోదీతో చిరంజీవి వేదిక పంచుకోవడం, ఇటీవల బీజేపీ ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ ఇవ్వడంతో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందన్న వాదనలు వినిపించాయి. అయితే అది కూడా జరగలేదు. తాజాగా తనపై జరుగుతున్న అన్ని ప్రచారాలకు ఒక్క మాటతో పుల్ స్టాప్ పెట్టేశారు మెగాస్టార్.
తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తాను ఏ రాజకీయ పార్టీలో లేనని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. అయితే పిఠాపురంలో తన తమ్ముడికి ఓటు వేయాలని ఓటర్లను మాత్రం అభ్యర్థించారు. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని తప్పక ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అతనిని గెలిపిస్తే మరింత సేవ చేస్తాడని ఆకాంక్షించారు. ఇదే సమయంలో ప్రత్యక్ష ప్రచారానికి వెళ్లబోనని స్పష్టం చేశారు. మెగాస్టార్ మొత్తానికి తాను కొందరి వాడిని కాదని అందరివాడిని ప్రూవ్ చేసుకున్నారు.