Shirisha Bhardwaj : ఆ బాధతోనే శిరీష్ భరద్వాజ్ మృతి!
చిరంజీవి (Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ (Sreeja) మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (Shirisha Bhardwaj) చనిపోయారు. చాలా కాలం నుంచి భరద్వాజ్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు.

Chiranjeevi's youngest daughter Sreeja's ex-husband Shirish Bharadwaj died.
చిరంజీవి (Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ (Sreeja) మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (Shirisha Bhardwaj) చనిపోయారు. చాలా కాలం నుంచి భరద్వాజ్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. సిచ్యువేషన్ సీరియస్ అవ్వడంతో రీసెంట్‌గానే ఆయన హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి హాస్పిటల్‌లోనే భరద్వాజ్‌కు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు డాక్టర్లు. ఇప్పుడు పరిస్థితి చేదాటిపోవడంతో ఆయన చనిపోయారు.
2007లో చిరంజీవి చిన్న కూతురు శ్రీజను లవ్‌మ్యారేజ్ చేసుకున్నరు భరద్వాజ్. అప్పట్లో వీళ్ల పెళ్లి రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తన తండ్రి నుంచి తమకు ప్రాణహాణి ఉందని శ్రీజ భరద్వాజ్ రోడ్డెక్కడంతో వీళ్ల పెళ్లి మ్యాటర్ రచ్చకెక్కింది. అయితే కొంత కాలం బాగానే ఉన్న వీళ్ల మధ్య మరస్పర్థలు రావడం మొదలయ్యింది. ఇక ఒకరితో ఒకరికి సెట్ అవ్వదు అని తెలియడంతో 2014లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఆ తరువాత 2019లో భరద్వాజ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి డాక్టర్‌గా పని చేస్తోంది. వేరే పెళ్లి చేసుకున్న తరువాత భరద్వాజ్ తన కాపురాన్ని చెన్నైకి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి వాళ్లు అక్కడే ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం లంగ్ సమస్య బారిన పడ్డారు భరద్వాజ్.. చాలా రోజుల నుంచి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా.. ఆరోగ్యం సెట్ అవ్వలేదు. దీంతో చికిత్స తీసుకుంటూనే ఇలా చనిపోయారు భరద్వాజ్