YSRCP-PAWAN KALYAN: పవన్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే.. సస్పెండ్ చేసిన జగన్
ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో పవన్‌ను ఆరణి శ్రీనివాసులు కలిస్తే.. సాయంత్రానికల్లా అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొద్దిరోజులుగా వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు.

YSRCP-PAWAN KALYAN: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల జంపింగ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. దీంతో వెంటనే స్పందించిన జగన్.. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో పవన్‌ను ఆరణి శ్రీనివాసులు కలిస్తే.. సాయంత్రానికల్లా అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం ప్రకటించింది.
CHANDRABABU NAIDU: ఏపీ సచివాలయం తాకట్టు.. జగన్‌పై చంద్రబాబు విమర్శలు
చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొద్దిరోజులుగా వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల నియోజకవర్గ ఇంఛార్జిగా విజయానందరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో తనను కాకుండా మరొకరిని నియోజకవర్గ ఇంచార్జిగా నియమించడంతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారు. అప్పటినుంచి పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని జనసేన ఆఫీసులో పవన్‌తో సమావేశమై చర్చలు జరిపారు. ఈ విషయం బయటకు రాగానే వైసీపీ స్పందించింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయన జనసేనలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
త్వరలోనే ఎమ్మెల్యే శ్రీనివాసులు జనసేన కండువా కప్పుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీ నియోజకవర్గ ఇంచార్జిల నియామకంతో చాలా మంది ఆ పార్టీని వీడుతున్నారు. అవకాశం దక్కని నేతలు జనసేన, టీడీపీ వైపు చూస్తున్నారు. ఇక నియోజకవర్గ ఇంచార్జిలే అభ్యర్థులు అని జగన్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.