UPSC Topper Ananya Case : సివిల్స్ టాపర్ అనన్య పోలీసులకు ఫిర్యాదు… అసలేం జరిగిందంటే…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రకటించిన సివిల్స్ 2023 జాబితాలో థర్డ్ ర్యాంక్ సాధించిన అనన్యా రెడ్డి న్యాయం కోసం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రకటించిన సివిల్స్ 2023 జాబితాలో థర్డ్ ర్యాంక్ సాధించిన అనన్యా రెడ్డి న్యాయం కోసం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో తన పేరుతో ఫేక్ అకౌంట్స్ తెరిచినట్టుగా అనన్య కేసు పెట్టారు. ఇన్ స్టా గ్రామ్, X, టెలిగ్రామ్ లో అనన్య ఆధ్వర్యంలో కోచింగ్ ఇస్తున్నట్టుగా కొందరు ప్రచారం చేసుకుంటున్నారు.
తన పేరు వాడుకుంటూ వేల మంది విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నట్టు అనన్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను సివిల్స్ థర్డ్ ర్యాంక్ సాధించిన వెంటనే వేలల్లో సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్ పుట్టుకొచ్చినట్టు అనన్య చెబుతున్నారు. ఈ అకౌంట్స్ ద్వారా అనన్య పేరు వాడుకుంటూ… అక్రమంగా వేలల్లో డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్టు పోలీసుల దృష్టికి తెచ్చారు. మెంటార్షిప్ పేరుతో అనన్య రెడ్డి ఫోటోలను వాడుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్న ఫేక్ గాళ్ళను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
సోషల్ మీడియా హ్యాండిల్స్, అకౌంట్స్ ను ట్రాక్ చేస్తున్నామన్నారు. అనన్య ఫిర్యాదుతో పోలీసులు సెక్షన్ 419, 420, 66సి కేసులను పెట్టబోతున్నారు. ఈ ఫేక్ అకౌంట్స్ కి సంబంధించి పోలీసులకు కీలక ఎవిడెన్స్ ను అనన్య ఇచ్చినట్టు తెలుస్తోంది. సైబరాబాద్ పోలీసులు ఈ కేసును విచారణ చేస్తున్నారు.