Classist nonsense: క్లాస్ ఫీలింగ్! ఇది కుల పిచ్చికి ఏం తక్కువ కాదు బాసూ..! వివక్షకు కేరాఫ్ హౌసింగ్ సొసైటిస్, గేటెడ్ కమ్యూనిటీస్!
చేసే పని ఏదైనా మర్యాద ఇవ్వాలి.. స్వీపర్ అయినా..క్లినర్ అయినా..సీఎం అయినా పనిని చూసి కాకుండా బుద్ధి చూసి గౌరవం ఇవ్వాలి.. కొంతమందికి అవేం పట్టవు..ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ, హౌసింగ్ సొసైటీ రూల్ మేకర్స్‌కు ఇలాంటివి ఉండవు.
కుల పిచ్చి,మత పిచ్చి ప్రవాహంలో ప్రతిసారీ క్లాస్ పిచ్చి కొట్టుకుపోతుంది. దీని గురించి మాట్లాడే వాళ్లు తక్కువ..ఎందుకంటే ఈ వివక్షను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఫాలో అయ్యే వాళ్లే ఎక్కువ. ఆ విషయం వాళ్లకి కూడా తెలియదంతే..! ఇంట్లో పని మనిషితో గిన్నెలు, ప్లేట్లు, స్పూన్లు కడిగించుకుంటాం.. ఆ గిన్నెల్లోనే వంట చేసుకుంటాం.. ఆ స్పూన్లతోనే చట్నీ వేసుకుంటాం.. వాళ్లని మాత్రం ముట్టుకోం..! కొంతమంది వంట మనుషులు చేసిందే తింటారు.. ఆ వండిన వాడికి మాత్రం సపరేట్ ప్లేటు, గ్లాసూ ఉంటాయి. అందులోనే అతను తినాలి. మళ్లీ ఇద్దరు తిన్నది అతనే కడుగుతాడు.. ఇదేం విడ్డూరమో అర్థంకాదు..! స్వయంగా వాళ్ల చేత్తో కడిగిన ప్లేట్లలోనే తింటున్నప్పుడు వాళ్లని ముట్టుకుంటే ఏం ఐపోతుందో అర్థంకాదు.. బహుశ క్లాస్ పిచ్చి చాటున దాక్కొని ఉన్న కుల పిచ్చి కావొచ్చు.. ఆ పనులు చేసేవాళ్లంతా ఓకే కులానికి చెందిన వారు కావొచ్చు. ఇప్పుడీ వివక్ష అంతా రూపాంతరం చెందుతుంది. మరో ప్రపంచంలో బతుకుతున్నామని ఫీల్ అవుతూ.. గేటెడ్ కమ్యూనిటీల్లోనే ఆనందం ఉందనుకునే వాళ్ల బుర్రల్లోకి ఇది వేగంగా స్ప్రెడ్ అయ్యింది. హైదరాబాద్, బెంగళూరు గేటెడ్ కమ్యూనిటీస్‌లో పాటిస్తున్న రూల్సే దీనికి బెస్ట్ ఎగ్జాంపూల్..!
పని మనిషులు పార్క్స్‌లోకి పోవద్దు:
గేటెడ్ కమ్యూనిటీస్, హౌసింగ్ సొసైటీస్‌లో పని మనుషుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఉదయానే కమ్యూనిటీలోకి సిగ్నెచర్(వేలుముద్ర)తో ఎంట్రీ ఇస్తారు. సాయంత్రం వరకు పని చేసి వెళ్లే వాళ్లు ఉంటారు.. మరికొంతమంది గంటకో..రెండు గంటలకో వెళ్లిపోతారు. అవసరాన్ని బట్టి ఉంటుంది. వాళ్లకి సపరేట్ లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్‌లోనే వెళ్లాలి. ఫ్లాట్‌లో వాళ్లకి ఇంకో లిఫ్ట్ ఉంటుంది. అందులో పనివాళ్లు ఎక్కకూడదు.. ఎక్కితే కోపం వస్తుంది.. రూల్స్ బోర్డు పెడతారు.. ఇదంతా అందరికి తెలిసిన విషయమే..!
తాజాగా బెంగళూరులోని ఓ హౌసింగ్ సోసైటీలో ఈ తరహా రూలే పెట్టారు. సోసైటీకి సంబంధించిన పార్కుల్లో, ఇతర కామన్ ఏరియాల్లో పనివాళ్లు తిరగకూడదని నిబంధన పెట్టారు. పనివాళ్ల కోసం ఓ ప్లేస్ ఉంటుందని.. ఆ వెయిటింగ్ ఏరియాలోనే ఉండాలని షరతులు పెట్టారు. ఎంత ఘోరం..! వాళ్లు పార్కుల్లోకి వెళ్లకూడదా..? మరి ఇళ్లలోకి ఎందుకు రానిస్తున్నారు..? వాళ్లతో పని ఎందుకు చేయించుకుంటున్నారు..? వాళ్లు రోజంతా మీ పిల్లల మధ్యే తిరుగుతుంటారు కదా..? అలాంటప్పుడు కామన్ ప్లేసుల్లో వాళ్లు తిరిగితే తప్పేంటి..? ఇంటిని, చుట్టూ ఉన్న పరిసరాల్ని శుభ్రంగా ఉంచే పనివాళ్లు పార్కుల్లో ఏం పాపం చేస్తారు..? ఇది ముమ్మాటికి వివక్షే..! వాళ్లు మీతో కలిసి పార్కుల్లో ఉంటే నామోషినా..? ఇదో టైప్ ఆఫ్ క్రూయలిటీ.. కంటికి క్లియర్‌గా కనిపించినా దేశం పెద్దగా గుర్తించని డబ్బు పిచ్చి..!