CM kcr: కేసీఆర్‌ ప్రకటన ఖర్చుకు.. 2వేల నోటు వెనక్కి తీసుకోవడానికి లింక్ ఉందా?

ఎక్కడో జరిగే చిన్న మూమెంట్‌.. ఇంకెక్కడో జరిగే మరో మూమెంట్‌కు కారణం అవుతుంది. ఇది సైన్స్.. ఇదే సైన్స్‌ కూడా ! రాజకీయాల్లోనూ ఇదే జరుగుతోంది. తీగ ఎక్కడో లాగితే.. డొంక ఇంకెక్కడో కదులుతూ ఉంటుంది. ఒక నిర్ణయం వెనక.. ప్రత్యర్థి తీసుకున్న మరో నిర్ణయం కారణం అయి ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 21, 2023 | 01:48 PMLast Updated on: May 21, 2023 | 1:48 PM

Cm Kcr Expensive For Advertisement

2వేల రూపాయల నోటు రద్దు తర్వాత ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్న మాటలు ఇవే. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. కచ్చితంగా దాని వెనక రాజకీయం ఉంటుంది. కొద్దిరోజుల కింద కేసీఆర్‌ మీద.. రాజ్‌దీప్ సర్దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష కూటమికి తననను నాయకుడిని చేస్తే.. 2024 ఎన్నికలకు ఖర్చు అంతా తాను భరించటానికి సిద్ధమని కేసీఆర్‌ చెప్పారంటూ బాంబ్ పేల్చారు.

దీనిమీద బీజేపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కేసీఆర్‌కు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయ్. అవినీతి చేయకపోతే ఇన్ని ఆస్తులు ఎలా అని నిలదీశాయ్. ఇంత జరుగుతున్నా వ్యవహారం మీద బీఆర్ఎస్‌ నేతలు ఎవరు కూడా కనీసం పెదవి విప్పలేదు. కట్‌ చేస్తే ఇప్పుడు రెండు వేల రూపాయల నోటు వెనక్కి తీసుకుంటూ ఆర్బీఐ ప్రకటించింది. చెప్పింది ఆర్బీఐ అయినా.. చెప్పించింది కేంద్ర ప్రభుత్వమే అని చిన్న పిల్లోడికి కూడా తెలుసు. దీంతో ఇప్పుడు కొత్త చర్చ స్టార్ట్ అయింది. కేసీఆర్‌ ప్రకటనకు.. రెండు వేల నోటు వెనక్కి తీసుకోవడానికి లింక్ ఏంటి అనే డిస్కషన్ మొదలైంది. కేసీఆర్‌కు షాక్ ఇచ్చి.. బీఆర్ఎస్‌ను దెబ్బతీసేందుకు.. ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ జరుగుతోంది.

ఒక్క బీఆర్ఎస్ అని మాత్రమే కాదు ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీలకు డబ్బు దొరకద్దనే ఇలాంటి ప్రకటన చేశారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. నిజానికి రెండు వేల రూపాయల నోటు రద్దుపై జనాల్లో ఎప్పటి నుంచో చర్చ ఉంది. ఐతే సరిగ్గా కీలక రాష్ట్రాల ఎన్నికల ముందు.. వెనక్కి తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయన్నది చాలామంది వాదన. తెలంగాణలోనూ వచ్చే ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయ్. పైగా మహారాష్ట్ర మీద కూడా కేసీఆర్‌ ఫోకస్ పెట్టారు. మిగతా పార్టీలకు షాక్ ఇచ్చేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా లేదా అన్న సంగతిపక్కనపెడితే.. బీఆర్ఎస్‌కు మాత్రం భారీ ఝలక్ తగలడం ఖాయం అనే చర్చ జరుగుతోంది.