రైతు బంధు కావాలా…. రాబంధు కావాలా… తేల్చుకోండి: తెలంగాణ సీఎం కేసీఆర్

రైతు బంధు వద్దంటున్న రాబంధులను ఓడించాలని పిలుపు ఇచ్చారు సీఎం కేసీఆర్. ధరణి వల్లే రైతుబంధు పైసలు మీ అకౌంట్లో పడుతున్నాయి. మేం హైదరాబాద్ లో డబ్బులు వేయగానే... మీ మొబైల్ లో టింగ్ మని మెస్సేజ్ వస్తుందని కేసీఆర్ తెలిపారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 16, 2023 | 06:15 PMLast Updated on: Nov 16, 2023 | 6:15 PM

Cm Kcr Speech Praja Aswirada Yatra

CM KCR Speech: తెలంగాణ నాశనం కావొద్దనేదే తన బాధ అనీ… మళ్లీ దుర్మార్గులు వచ్చి ధరణి తీసేస్తాం అంటున్నారు. కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? రైతుబంధు (Rythu bandhu) కావాలా? రాబంధు కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు సీఎం కేసీఆర్. మంది మాట పట్టుకొని మార్మానం పోతే.. మళ్ళొచ్చే వరకు ఇల్లు గాలికి పోయిందని పెద్దలు చెప్పారు. కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే పరిస్థితి అలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజా ఆశీర్వాద యాత్రలో బీఆర్ఎస్ (BRS) చీఫ్, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ (Telangana ) దేశంలోనే నెంబర్ 1 ప్లేసులో ఉంది. ఓ పాలసీ ప్రకారం రాష్ట్రంలో పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తూ అన్ని రంగాల్లో విజయం సాధించామని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) లను నమ్మితే నట్టేట మునిగినట్టేనని విమర్శించారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని, అభ్యర్థి చరిత్ర, ఆ పార్టీ అభివృద్ధిని చూసి ఆలోచించి ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ అన్ని రంగాల్లో వృద్ధి సాధించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతులు బాగుండాలని నీటి పన్ను రద్దు చేశాం. 24 గంటల ఉచిత్ విద్యుత్ ను అందిస్తున్నాం. ఉచిత కరెంట్, రైతుబంధు, రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనడం. రైతు చనిపోతే వారంలోపే 5 లక్షల బీమా వస్తోంది. వందల్లో ఉన్న పింఛన్ ను వేల రూపాయలకు పెంచాం. మూడేళ్లు ఆలోచించి ధరణి తెచ్చి… దళారుల రాజ్యం లేకుండా చేశాంమని కేసీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో అన్ని మతాల వారు కలిసి మెలిసి ఉంటున్నారనీ, మత పిచ్చి లేపే బీజేపీకి జనం బుద్ధి చెప్పాలని కేసీఆర్ కోరారు. తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని నిలదీశారు. గతంలో మంచినీళ్ల కోసం ఎంతో బాధ పడ్డామని, అందుకే మిషన్ భగీరథ తెచ్చామన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు ఇప్పటికే పోడూ భూముల పట్టాలిచ్చాం. గిరిజనేతరులకు కూడా వచ్చే దఫాలో పట్టాలిస్తామని కేసీఆర్ అన్నారు.