CONGRESS MP TICKETS: కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్లపై క్లారిటీ.. ఢిల్లీ టూర్‌లో ఏం చెప్పారంటే..

తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టిక్కెట్ల కోసం 309 మంది ఆశావహులు అప్లయ్ చేశారు. ఈ లిస్ట్‌ను AICC జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకొచ్చారు రేవంత్, భట్టి విక్రమార్క.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2024 | 03:02 PMLast Updated on: Feb 21, 2024 | 3:02 PM

Cm Revanth Reddy Delhi Tour Discussed About Congress Mp Tickets

CONGRESS MP TICKETS: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళొచ్చారు. కానీ అక్కడ ఏం జరిగింది..? కాంగ్రెస్ పెద్దలతో ఏం మాట్లాడారు..? ఎంపీ టిక్కెట్లు ఎవరికి ఇస్తారు..? మంత్రి పదవులు వస్తాయా..? నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తారా..? ఇలాంటి అంశాలపై కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తల్లో ఆసక్తి కనిపిస్తోంది. అయితే వీటిన్నింటిపైనా రేవంత్ రెడ్డి, భట్టికి కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టిక్కెట్ల కోసం 309 మంది ఆశావహులు అప్లయ్ చేశారు.

Vemireddy Prabhakar Reddy: జగన్‌కి ఝలక్.. 23న టీడీపీలోకి వేమిరెడ్డి

ఈ లిస్ట్‌ను AICC జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకొచ్చారు రేవంత్, భట్టి విక్రమార్క. అయితే గెలిచే అభ్యర్థులకే లోక్‌సభ టిక్కెట్లు ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ చేసింది. పార్టీ అధికారంలో ఉన్నందున.. తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని వేణుగోపాల్ సూచించారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డికి, రాష్ట్ర నేతలకే అప్పగించినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. రెండు దశల్లో ఎంపీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించాలని కేసీ సూచించారు. అందులో భాగంగా ఈనెలాఖరులో కాంగ్రెస్ మొదటి జాబితాను రిలీజ్ చేస్తుందని తెలుస్తోంది. సెకండ్ లిస్ట్ మార్చి మొదటి వారంలో విడుదల చేయాలని కేసీ వేణుగోపాల్ సూచించినట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో రోజు రోజుకీ దిగజారిపోతోందనీ.. చాలామంది బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. అందుకే బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తోందని చెప్పారు. లోక్ సభ టిక్కెట్లకు హామీ ఇస్తే.. గులాబీ పార్టీకి రాజీనామా చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారన్నారు రేవంత్.

కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేయ్యడం పైనా డిస్కషన్ నడిచింది. అవినీతి ఆరోపణలకు భయపడే కేసీఆర్ గైర్హాజరు అయినట్టు రేవంత్, భట్టి మీటింగ్‌లో వివరించారు. కేసీ వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశానికి ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా హాజరయ్యారు. తెలంగాణలోని లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితిని ఆయన వివరించారు. దానికి సంబంధించిన సర్వే రిపోర్టులను కూడా బయటపెట్టారు. రాబోయే ఎన్నికల ప్రచార వ్యూహాన్ని కూడా సునీల్ కనుగోలు వివరించినట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రవేశపెట్టడంపై జనంలో మంచి రెస్పాన్స్ వచ్చిందని సునీల్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల లోపు మిగతా గ్యారంటీలను కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డికి AICC జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సూచించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

BJP DEMANDS TDP: చంద్రబాబు పాట్లు.. ఇస్తావా.. చస్తావా! బాబుకు బీజేపీ హుకుం

రాష్ట్ర కేబినెట్ విస్తరణ పైనా చర్చ జరిగింది. లోక్ సభ ఎన్నికల తర్వాతే కేబినెట్ విస్తరణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ప్రకటిస్తే అసంతృప్తి చెలరేగుతుందనీ.. అది పార్టీ విజయవకాశాలపై ప్రభావం పడుతుందని చెప్పినట్టు సమాచారం. నామినేటెడ్ పోస్టులను కూడా పోస్ట్ పోన్ చేయడం.. లేదంటే సగం ఇప్పుడు ప్రకటించి.. మిగిలినవి లోక్ సభ ఎన్నికల తర్వాత ఇవ్వడం బెటర్ అనే చర్చ కూడా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల దగ్గర జరిగినట్టు చెబుతున్నారు.