CM Revanth Reddy: మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తారా.. కాపలాగా నేనున్నా: రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఆరోగ్యం కూడా బాగాలేదు. 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ పిట్టలదొరలా మాట్లాడుతున్నాడు. గతంలో మాదిరిగా ఎమ్మెల్యేలను కొనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే.. ఇక్కడ కాపలాగా రేవంత్ రెడ్డి ఉంటాడు.
CM Revanth Reddy: తమతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ చెప్పడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. దమ్ముంటే తమ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు. తాను హైటెన్షన్ వైర్ లాంటోడని, వచ్చి టచ్ చేసి చూస్తే ఏమవుతుందో తెలుస్తుందన్నారు. శుక్రవారం పాలమూరు జిల్లాలో జరిగిన ప్రచార సభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
Mansoor Ali Khan: తమిళ నటుడిపై విష ప్రయోగం జరిగిందా.. ఇప్పుడెలా ఉన్నాడు..?
“కేసీఆర్ ఆరోగ్యం కూడా బాగాలేదు. 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ పిట్టలదొరలా మాట్లాడుతున్నాడు. గతంలో మాదిరిగా ఎమ్మెల్యేలను కొనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే.. ఇక్కడ కాపలాగా రేవంత్ రెడ్డి ఉంటాడు. ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటాను. మా ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు.. మాడి మసైపోతావ్. కేసీఆర్ చిటికె కాదు.. డప్పు కొట్టినా ఎవరు రారు. రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైర్ లాంటోడు. వచ్చి టచ్ చేసి చూస్తే ఏమవుతుందో తెలుస్తుంది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కేటీఆర్ మాత్రం కేవలం కారు రిపేర్ అయిందని చెబుతున్నారు. కానీ ఇంజనే పూర్తిగా పాడైపోయింది. తూకం పెట్టి అమ్మేసే సమయం వచ్చింది. కేసీఆర్ పదేళ్లలో పాలమూరుకు ఏం చేశారు..?
ఈ జిల్లాను ఎడారిగా మార్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా..? పాలమూరుకు ఏమీ చేయని బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటేయాలి..? పార్లమెంట్‌లో నిద్రపోవడానికా..? ఇప్పటికైనా పాలమూరు ప్రజలు కళ్లు తెరిచారు. కాంగ్రెస్ హయాంలో ఇక్కడ అనేక ప్రాజెక్టులు చేపట్టాం. కాంగ్రెస్‌కు ఓటు వేసి మహబూబ్ నగర్ అభివృద్ధికి ఓటేయాలి” అని రేవంత్ వ్యాఖ్యానించారు.