REVANTH REDDY: తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్.. కాళేశ్వరంపై చర్చకు కేసీఆర్ సిద్ధమా: రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై కేసీఆర్ చర్చకు రావాలి. అసెంబ్లీకి రమ్మంటే రాకుండా.. టీవీ చర్చల్లో కేసీఆర్ గంటలు గంటలు మాట్లాడుతున్నారు. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కలసి వెళదాం. ఆయన కట్టిన అద్భుతమేంటో చూపిస్తాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2024 | 08:47 PMLast Updated on: Apr 25, 2024 | 1:33 PM

Cm Revanth Reddy Fires On Kcr Modi And Bjp In Warangal

REVANTH REDDY: కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై కేసీఆర్ చర్చకు రావాలని డిమాండ్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్‌లో నిర్వహించిన బహింగసభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్, హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “రూ. లక్ష కోట్లు పెట్టిన కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై కేసీఆర్ చర్చకు రావాలి. అసెంబ్లీకి రమ్మంటే రాకుండా.. టీవీ చర్చల్లో కేసీఆర్ గంటలు గంటలు మాట్లాడుతున్నారు.

YS JAGAN: ముగిసిన సిద్ధం యాత్ర.. జగన్‌ కన్నీటి లేఖ..

దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కలసి వెళదాం. ఆయన కట్టిన అద్భుతమేంటో చూపిస్తాం. పదేళ్లుగా కల్వకుంట్ల కుటుంబం దోచుకుతింది. కేసీఆర్ చచ్చిన పాము. ఎంత కొట్టినా వేస్ట్. అధికారం పోయిందని కొంత మంది తోక తెగిన బల్లుల్లా ఎగిరెగిరి పడుతున్నారు. మామా, అల్లుళ్లకు ఇంకా అధికార మత్తు దిగినట్లు లేదు. తెలంగాణను దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం పీడ విరగడయింది. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. వానలొస్తే వరంగల్ చిన్న సముద్రంలా మారిపోతుంది. వరంగల్‌ను అందమైన నగరంగా తీర్చిదిద్దుతాం. వరంగల్ పట్టణాన్ని పీడిస్తున్న చెత్త సమస్యకు పరిష్కారం చూపుతాం. తెలంగాణకు వరంగల్ రెండో రాజధానిగా అన్ని అర్హతలున్నాయి. వరంగల్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఎయిర్ పోర్టు కూడా నిర్మిస్తాం. ఈ ప్రాంతంలో ఇండ్రస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మాదే. ఇక్కడే కూర్చుని సమస్యలను పరిష్కరించే బాధ్యతను తీసుకుంటా.

ఎన్నో పోరాటాలు చేస్తే కానీ గిరిజన యూనివర్శిటీని మంజూరు చేయలేదు. వరంగల్‌కు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో మోసం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కూడా పక్క రాష్ట్రాలకు తరలించుకు పోయారు. చేనేతపై జీఎస్టీ వేసి చేనేతలపై బారం మోపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ మరోసారి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. రైతు వ్యతిరేకత ప్రభుత్వమైన మోదీ సర్కార్‌కు ఓటు వేయొద్దు” అని రేవంత్ వ్యాఖ్యానించారు.