CM Revanth Reddy : జిల్లా కలెక్టర్లతో.. సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

నేడు తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తొలి సారిగా ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ సమావేశంకు కలెక్టర్లు, ఎస్పీలు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు, వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 24, 2023 | 09:54 AMLast Updated on: Dec 24, 2023 | 11:23 AM

Cm Revanth Reddy Is Going To Meet With District Collectors In Telangana Secretariat Today

నేడు తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తొలి సారిగా ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ సమావేశంకు కలెక్టర్లు, ఎస్పీలు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు, వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిల నిర్వహన పై.. 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, ప్రజా పాలన కార్యక్రమాలపై లోతుగా చర్చిస్తారు. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు, భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్‌ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఈ కలెక్టర్ల సమావేశంలో ప్రకటించనున్నారు రేవంత్‌. ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం.