CM Revanth IPL Match: ఫ్యామిలీతో కలిసి IPL మ్యాచ్‌కి సీఎం రేవంత్ రెడ్డి..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఉప్పల్ స్టేడియం దగ్గర భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇప్పటి దాకా ఏ సీఎం కూడా IPL మ్యాచ్‌లు చూసిన సందర్భాలు లేవు. కానీ రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వస్తున్నారు.
CM Revanth IPL Match: ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. దాన్ని చూసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలసి వెళ్తున్నారు. ఓ వైపు లోక్ సభ ఎన్నికల వేళ తుక్కుగూడలో శనివారం నాడు జనజాతర మీటింగ్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలోనూ రేవంత్ మ్యాచ్ చూడ్డానికి రావడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఉప్పల్ స్టేడియం దగ్గర భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.
YS SHARMILA: వివేకాను చంపిన వారికే జగన్ టిక్కెట్.. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే పోటీ: షర్మిల
ఇప్పటి దాకా ఏ సీఎం కూడా IPL మ్యాచ్‌లు చూసిన సందర్భాలు లేవు. కానీ రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వస్తున్నారు. మొన్నీమధ్యే హోలీ వేడుకల్లోనూ తన మనువడితో కలసి రేవంత్ ఎంజాయ్ చేశారు. IPL చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన టీమ్‌గా హైదరాబాద్, అత్యధికసార్లు టైటిల్ విన్నర్ చెన్నై టీమ్ కావడంతో.. ఉప్పల్ మ్యాచ్‌కు క్రికెట్ ఫ్యాన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. అందులో మిస్టర్ కూల్ ధోనీ ఈ IPL సిరీస్ చివరిది అని వార్తలు వస్తున్నాయి. దాంతో ధోనీని ప్రత్యక్షంగా చూడాలన్న ఉద్దేశ్యంతో క్రికెట్ ఫ్యాన్స్ టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు. గ్రౌండ్‌లో చూసేది ఇదే చివరిసారి అనుకుంటున్నారు ఫ్యాన్స్. టిక్కెట్ రేటు ఎక్కువైనా.. ధోనీని చూడాలన్న ఆరాటంలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇదే అదునుగా బ్లాక్ మార్కెట్ కేటుగాళ్ళు దందా చేస్తున్నారు. టిక్కెట్లను భారీ రేట్లకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు.
బరితెగించిన బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు.. వెయ్యి రూపాయల టికెట్ 6 వేలకు పైగా అమ్ముతున్నారు. అలాగే 3 వేల టికెట్ ని 10 నుంచి 12 వేల రూపాయలుకు సేల్ చేస్తున్నారు. ఒక్కోటి 20 వేల రూపాయలు అయినా కొనేందుకు క్రికెట్ ఫ్యాన్స్ వెనుకాడటం లేదు. బహిరంగంగా బ్లాక్ టికెట్ల అమ్మకాలను HCA గానీ పోలీసులు గానీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వాట్సాప్ చాట్ తో బ్లాక్ టికెట్ల దందా నడుస్తోంది. బెట్టింగ్స్ దందా కూడా లక్షల్లో నడుస్తోంది. ఎవరు ఎంత స్కోర్ చేస్తారు.. ఎవరు ఎన్ని పరుగులు చేస్తారు.. లాంటి ఇష్యూస్‌తో ఫ్యాన్సీ బెట్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు బుకీలు. ఆన్‌లైన్లోనే లక్షల్లో చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది.