CM Revanth Reddy : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు ఆయన అక్కడే పర్యటించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం..

CM Revanth Reddy will go to Delhi today. He will visit there for two days.
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు ఆయన అక్కడే పర్యటించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం.. మరో వైపు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలవనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ శాఖలకు చెందిన కేంద్రమంత్రుల అనుమతులు ఖరారు అయ్యాయని తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి.. పెండింగ్ బకాయిలు, వివిధ ప్రాజెక్టులకు నిధుల మంజూరు కోరే అవకాశాలు ఉన్నాయి.