Ramadan : రేపు ఎల్బీ స్టేడియంలో ముస్లీం సోదరులకు సీఎం రేవంత్ రెడ్డి ఇఫ్తార్ విందు..

ప్రపంచ మంతట రంజాన్ మాసం ప్రారంభమైంది. దేశమంతటా ముస్లీం సోదరులు ఉపవాస దీక్షలు పాటిస్తున్నారు. ఈ రంజాన్ (Ramadan) మాసం లో ఇఫ్తార్ విందులు ఇస్తుంటారు. తెలంగాణలో కూడా రాష్ట్ర ముస్లిం సోదరులకు రాష్ట్రం ప్రభుత్వం ఇఫ్తాన్ విందు ఇవ్వండ జరుగుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 14, 2024 | 09:50 AMLast Updated on: Mar 14, 2024 | 9:50 AM

Cm Revanth Reddys Iftar Dinner For Muslim Brothers Tomorrow At Lb Stadium

 

 

 

ప్రపంచ మంతట రంజాన్ మాసం ప్రారంభమైంది. దేశమంతటా ముస్లీం సోదరులు ఉపవాస దీక్షలు పాటిస్తున్నారు. ఈ రంజాన్ (Ramadan) మాసం లో ఇఫ్తార్ విందులు ఇస్తుంటారు. తెలంగాణలో కూడా రాష్ట్ర ముస్లిం సోదరులకు రాష్ట్రం ప్రభుత్వం ఇఫ్తాన్ విందు ఇవ్వండ జరుగుతుంది. గత ప్రభుత్వం కూడా ముస్లీం సోదరులకు ఇఫ్తాన్ విందు ఇచ్చారు. కాగా తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముస్లీం సోదరుల కోసం ఈ నెల 15వ తేదీన తొలి శుక్రవారం రోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఇప్తార్ విందును రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ ఇప్తార్ విందుకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రజాప్రతి నిధులు గౌరవ అతిధులుగా హాజరు కారున్నారు.

రాష్ట్రంలో ఇఫ్తార్ విందు నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ బుధవారం సంబంధిత అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లా డుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్న సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఏర్పాట్లను.. మహమ్మద్ షబ్బీర్ అలీ, రాజ్యసభ సభ్యుడు ఎం. అనిల్ కుమార్ యాదవ్, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీం, ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, జీ.హెచ్.యం.సీ. కమీషనర్ రోనాల్డ్ రోస్‌తో పాటు ఇతర శాఖల ముఖ్య అధికారులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా ఇఫ్తార్ విందు కోసంభారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముస్లీం సోదరులు పెద్ద ఎత్తున ఈ ఇఫ్తార్ విందులో పాల్గొంటారని తెలుస్తుంది.