CM Revanth Reddy : ముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన.. కాసేపట్లో వరంగల్‌కు సీఎం రేవంత్ టూర్..
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. ఢిల్లీలో తెలంగాణ పీసీసీ కొత్త చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, పార్టీలో చేరికలు తదితర అంశాలపై వారితో చర్చించారు.

ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. ఢిల్లీలో తెలంగాణ పీసీసీ కొత్త చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, పార్టీలో చేరికలు తదితర అంశాలపై వారితో చర్చించారు. దీంతో తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి బయల్దేరారు. దీంతో తెలంగాణలో సీఎం నేటి వరంగల్ టూర్ షెడ్యూల్ విడుదలైంది. ఈరోజు మధ్యహ్నం 1.00 గంటలకు వరగంలో చేరుకుంటారు.
వరంగల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం టెక్స్‌టైల్స్ పార్క్, ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై సమీక్షిస్తారు. అనంతరం సాయంత్రం 7.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.