కెప్టెన్,కోచ్ మధ్య కోల్డ్ వార్ రోహిత్ ను పట్టించుకోని గంభీర్

న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాజయంతో టీమిండియా విమర్శల సుడిగుండంలో చిక్కుకుంది. అదే సమయంలో భారత జట్టుకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు నెలకొన్నట్టు సమాచారం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 5, 2024 | 08:02 PMLast Updated on: Nov 05, 2024 | 8:02 PM

Cold War Between Captain And Coach Gambhir Ignores Rohit

న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాజయంతో టీమిండియా విమర్శల సుడిగుండంలో చిక్కుకుంది. అదే సమయంలో భారత జట్టుకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు నెలకొన్నట్టు సమాచారం. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక రకమైన పిచ్‌ను ఆశిస్తే.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరో రకమైన పిచ్‌‌ను సిద్ధం చేయించినట్లు తెలుస్తోంది. అలానే జట్టు ఎంపికలోనూ రోహిత్ శర్మకి స్వేచ్ఛని ఇవ్వలేదనే విషయం వెలుగులోకి వచ్చింది.ఆస్ట్రేలియాతో నవంబరు 22 నుంచి ప్రారంభంకానున్న టెస్టు సిరీస్‌‌కి జట్టు ఎంపికలోనూ గంభీర్ ఎక్కువ చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా ఇద్దరు ప్లేయర్లని జట్టులోకి తీసుకున్నాడట.

వాస్తవానికి ఆస్ట్రేలియా గడ్డపై గతంలో సత్తాచాటిన శార్ధూల్ ఠాకూర్‌ని ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకోవాలని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రతిపాదిస్తే.. గంభీర్ మాత్రం రోహిత్ శర్మ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా నితీశ్ కుమార్‌ రెడ్డిని తీసుకున్నాడట. అలానే కొత్త బౌలర్ హర్షిత్ రాణా ఎంపికలోనూ గంభీర్ పాత్ర ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అలాగే టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ సాధారణంగా దూకుడుగా ఆడటానికి ఇష్టపడతాడు. టీమ్‌కి కూడా అదే చెప్తుంటాడు. కానీ.. గంభీర్ మాత్రం.. టెస్టు క్రికెట్‌ను రక్షణాత్మక ధోరణిలోనే ఆడాలని టీమ్‌కి ఆదేశించినట్లు తెలుస్తోంది. అలానే న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కి పుణె, వాంఖడే పిచ్‌లను మూడోరోజు నుంచి బంతి తిరిగేలా తయారు చేయమని రోహిత్ శర్మ సూచిస్తే.. గంభీర్ మాత్రం మొదటి రోజు నుంచే బంతి తిరిగేలా తయారు చేయమని క్యూరేటర్లకి సూచించినట్లు వెలుగులోకి వచ్చింది.

శ్రీలంకతో ఇటీవల వన్డే సిరీస్, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ సమయంలో తుది జట్టుని గంభీర్ ఏకపక్షంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు సిరీస్‌ల్లోనూ భారత్ జట్టు చిత్తుగా ఓడిపోగా.. రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూములో సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. సాధారణంగా హెడ్ కోచ్, కెప్టెన్ కలిసి పనిచేయడం అరుదుగానే కనిపిస్తుంటుంది. గతంలో విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే మధ్య ఇలాంటి విభేదాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ మధ్య సఖ్యత బాగా కుదిరింది. తర్వాత వచ్చిన రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ మధ్య కూడా ఎలాంటి విభేదాలు రాలేదు. ఇప్పుడు రోహిత్, గంభీర్ మధ్య ఆసీస్ టూర్ కు ముందు విభేదాలు తెరపైకి రావడం జట్టుకు ఇబ్బందిగా మారింది.