CM convoy : సీఎం కాన్వాయ్ కార్ల రంగుల మార్పు ! రేవంత్ రెడ్డికి ఏ కలర్ ఇష్టమంటే !
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ లోని కార్లకు బ్లాక్ రంగు మార్చాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటివరకూ ఆయన ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూయిజర్ రంగు బ్లాక్ లో ఉంది. మిగతావన్నీ వైట్ కలర్ లో ఉన్నాయి. దాంతో సీఎం రేవంత్ రెడ్డి ఎందులో ప్రయాణిస్తున్నారో బయటి వారికి క్లియర్ గా తెలిసిపోతుంది. ఇది చాలా డేంజర్. దుండగులు సీఎంను టార్గెట్ చేసే ఛాన్స్ ఈజీగా ఉంటుంది. అందుకే కాన్వాయ్ లోని కార్లనీ ఇక ముందు ఒకే కలర్ లో.. నలుపు రంగులోకి మార్చబోతున్నారు.

జనరల్ గా సీఎం కాన్వాయ్‌లోని కార్లన్నింటికీ ఒకే రంగు, ఒకే నంబర్ ప్లేట్లు ఉంటాయి. ఏదైనా టూర్ కి వెళ్తున్నప్పుడు.. మధ్యమధ్యలో కార్ల వరుసక్రమాన్ని సెక్యూరిటీ సిబ్బంది మారుస్తుంటారు. భద్రతలో భాగంగా సీఎం ఏ కారులో వెళ్తున్నారన్నది దుండగులకు తెలియకుండా కార్లను ఒకే రంగులో ఉంచుతారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని కార్ల సంఖ్యను 0009గా మార్చారు. సీఎం కారుకు TS 07 FF 0009 నంబర్ కేటాయించారు. అలాగే మిగిలిన కార్లలో TS 09 RR 0009 అనే నంబర్ ఉంటుంది. ప్రస్తుతం 4 రంగుల ల్యాండ్ క్రూయీజర్ వాహనంలో సీఎం రేవంత్ ప్రయాణిస్తున్నారు. మరికొన్ని కార్లు వెండి, తెలుపు రంగుల్లో ఉన్నాయి. దీంతో ఆయన ఏ కారులో వెళ్తున్నారో.. ఇతరులకు తెలిసిపోతోంది. భద్రతను దృష్టిలో పెట్టుకొని కార్లన్నీ ఒకే రంగులో, నెంబర్ ప్లేట్లు ఒకే సిరీస్‌లో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకే తన కాన్వాయ్‌లోని తెల్లటి కార్లకు నలుపు రంగు వేయాలని ఆదేశించారు. రేవంత్ కు బ్లాక్ కలర్ ఇష్టం. అందకే ప్రస్తుతం కాన్వాయ్‌లో తెల్లటి కార్లను.. తన ల్యాండ్ క్రూయిజర్ కలర్ లోకి మార్చాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో 8 వైట్ టయోటా ల్యాండ్ క్రూయిజర్స్ ఉన్నాయి. ఇవి బుల్లెట్ ప్రూఫ్ కలిగినవి కూడా. కేసీఆర్ కు తెలుపు రంగు అంటే ఇష్టం. అందుకే ఆ కార్లన్నీ తెల్లగా ఉన్నాయి. ప్రస్తుత సీఎం రేవంత్‌కి నాలుగు రంగుల ల్యాండ్ క్రూయిజర్ నచ్చడంతో కాన్వాయ్ లోని కార్ల రంగులు నలుపులోకి మారుతున్నాయి.