Congress: కాంగ్రెస్‌తోనే కామ్రేడ్లు.. ఈ రెండు స్థానాల నుంచి పోటీ..
తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ తో జోడీ కట్టేందుకు దాదాపు సిద్దమైంది. రేపోమాపో ఎన్ని సీట్లు కేటాయిస్తారన్న విషయంలో స్పష్టత రానుంది.
బీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం ప్రయత్నించి భంగపడ్డ కామ్రేడ్లు ఆఖరికి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్‌తో సీపీఎం, సీపీఐలు జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చిట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నకల్లో పొత్తు గురించి మాట్లేడేందుకు టీపీసీసీ నేతలు స్వయంగా కామ్రేడ్లను ఆహ్వానించారు. విడివిడిగా రెండు పార్టీల నేతలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కామేడ్లు నాలుగు సీట్లు డిమాండ్ చేశారు. కానీ కొత్తగూడెం, మునుగోడు రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఆ చర్చలు ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిశాయి. ఆ తరువాత రాష్ట్రంలో పరిస్థితిలు పార్టీ నిర్ణయాలను అనుగునంగా నిర్ణయం తీసుకున్న కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఆఫర్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
కొత్తగూడెం, మునుగోడు సీట్లు తీసుకుని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పొట్టుకునేందుకు సీపీఎం, సీపీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా పొత్తు దాదాపు ఖరారైందని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో క్రమక్రమంగా బలంగా మారుతున్న కాంగ్రెస్ ఇప్పుడు సీపీఎం, సీపీఐని కూడా తనవైపు తిప్పుకోవడం ఆ పార్టీకి బలంగా మారింది. బీఆర్‌ఎస్‌లో అసంతృప్తులుగా ఉన్న చాలా మంది నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. బీఆర్‌ఎస్ నాలుగు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం, చాలా వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామంటూ ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా ఆయుధంగా మారింది. దీంతో ఈ సారి ఎన్నికలు గత ఎన్నికల కంటే సరవత్తరంగా సాగనున్నాయి.