Microsoft : మైక్రోసాఫ్ట్‌కు ఏమైంది.. ఎక్కడ తప్పు జరిగిందంటే..

కంప్యూటర్, ఇంటర్నెట్.. ఇప్పుడు జీవితంలో భాగం అయ్యాయ్. కాసేపు ఆగిపోతే ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో.. ప్రత్యక్షంగా తెలుసొచ్చింది జనాలకు ! మైక్రోసాఫ్ట్‌లో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 19, 2024 | 06:00 PMLast Updated on: Jul 19, 2024 | 6:00 PM

Computer Internet Have Become A Part Of Life Now What Will Be The Effect If It Is Stopped For A While

కంప్యూటర్, ఇంటర్నెట్.. ఇప్పుడు జీవితంలో భాగం అయ్యాయ్. కాసేపు ఆగిపోతే ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో.. ప్రత్యక్షంగా తెలుసొచ్చింది జనాలకు ! మైక్రోసాఫ్ట్‌లో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ కనిపిస్తోంది. దీంతో ఆయా సిస్టమ్‌లు షట్‌డౌన్‌, రీస్టార్ట్‌ అయ్యాయ్. విండోస్‌ సరిగా లోడ్‌ కాలేదు. రీస్టార్‌ చేయడానికి ప్రయత్నంచండి అంటూ మెసేజ్ చూపించింది. ఈ ఎర్రర్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ సర్వీసులపై ప్రభావం పడింది. ఐతే ఈ మధ్యే చేపట్టిన క్రౌడ్‌ స్ట్రైక్‌ కారణంగానే.. ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్‌ కన్ఫార్మ్‌ చేసింది. క్రౌడ్‌ స్ట్రయిక్‌ అనేది ఓ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ. విండోస్‌తో పాటు వివిధ సంస్థలకు అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీని అంతిస్తుంది.

లేటెస్ట్‌గా విండోస్‌ సిస్టమ్స్‌లో కనిపించిన బ్లూ స్క్రీన్‌ ఎర్రర్‌కు.. ఆ సర్వీసు అప్‌డేటే కారణమని క్రౌడ్‌ స్ట్రయిక్‌ తెలిపింది. బ్లూ స్క్రీన్‌లో కనిపిస్తున్న ఈ ఎర్రర్స్‌ను… బ్లాక్‌ స్క్రీన్‌ ఎర్రర్స్‌, స్టాప్‌ కోడ్‌ ఎర్రర్స్‌ అంటారు. దీనివల్ల విండోస్‌ ఒక్కసారిగా షట్‌డౌన్‌, లేదా రీస్టార్ట్‌ అవుతుంది. సాధారణంగా హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ సమస్యల వల్ల ఈ ఎర్రర్స్‌ తలెత్తుతుంటాయి. ఇటీవల ఏదైనా హార్డ్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేయడం వల్ల బ్లూ స్క్రీన్‌ ఎర్రర్‌ తలెత్తి ఉంటే.. సిస్టమ్‌ను షట్‌డౌన్‌ చేసి, హార్డ్‌వేర్‌ను తొలగించి రీస్టార్ట్‌ చేయాల్సి ఉంటుంది. తాజా బ్లూస్క్రీన్‌ ఎర్రర్‌ను ఎలా ట్రబుల్‌ షూట్‌ చేయాలి అనే విషయాన్ని మైక్రోసాఫ్ట్ సూచించింది. మైక్రోసాఫ్ట్ ఎర్రర్స్‌పై.. సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పేలుతున్నాయ్.

మైక్రోసాఫ్ట్‌ ప్రాబ్లమ్‌తో.. చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనులు ఆగిపోయాయ్. అసలే వీకెండ్.. ఈ ఆఫర్ అంటూ వీకెండ్ భలే జరిగిందే అంటూ పోస్టులు పెట్టారు. ఇక అటు విండోస్‌లో సాంకేతిక సమస్యతో విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. హైదరాబాద్‌లోనూ విమాన సర్వీసులు ఆగిపోయాయ్‌. విండోస్ ఎర్రర్‌పై.. ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. మైక్రోసాఫ్ట్‌ కంటే మైక్రో హార్డ్ బెటర్ అంటూ సెటైరికల్‌ ట్వీట్ చేశారు.