BRS, Sabita Indra Reddy : సీఎం వ్యాఖ్యలపై అసెంబ్లీలో గందరగోళం.. కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ MLA సబిత ఇంద్రారెడ్డి

వెనకాల కూర్చున్న అక్కల మాటలు వింటే KTR JBSలో కూర్చోవాల్సి వస్తుందని CM రేవంత్ అసెంబ్లీలో అన్నారు. CM వ్యాఖ్యలపై BRS నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు ఆ పార్టీని తిడుతున్నారని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. CM తనను టార్గెట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సబిత డిమాండ్ చేస్తు.. మీడియా పాయింట్ వద్ద భావోద్వేగానికి గురయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 31, 2024 | 06:41 PMLast Updated on: Jul 31, 2024 | 6:41 PM

Confusion In The Assembly Over The Cms Comments Former Minister Brs Mla Sabitha Indra Reddy Shed Tears

 

 

 

తెలంగాణ అసెంబ్లీ (Telangana assembly meetings) లో బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని.. మహిళలంటే చిన్న చూపు అని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తర్వత అదే బాటలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా మాజీ మంత్రిపై వ్యాఖ్యలు చేయ్యడంతో సభితా ఇంద్రారెడ్డి.. మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఎమ్మెల్యే సబిత (Sabita Indra Reddy) కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘రేవంత్ రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదు. కేటీఆర్ ప్రసంగం నుంచి దృష్టి మళ్లించేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సభలో నా పేరు ప్రస్తావించి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సభ నుంచి దొంగలా పారిపోయారు. సీఎం రేవంత్ (CM Revanth Reddy) క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అనంతరం.. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఇవాళ్టి సమావేశంలో ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య హోరాహోరీగా వాదోపవాదాలు నడిచాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టుడంతో సభలో కాసేపు గందగోళ వాతావరణం ఏర్పడింది.

  • మాజీ మంత్రి సబితా పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు..

వెనకాల కూర్చున్న అక్కల మాటలు వింటే KTR JBSలో కూర్చోవాల్సి వస్తుందని CM రేవంత్ అసెంబ్లీలో అన్నారు. CM వ్యాఖ్యలపై BRS నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్లోకి వచ్చి నిరసన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు ఆ పార్టీని తిడుతున్నారని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. CM తనను టార్గెట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సబిత డిమాండ్ చేస్తు.. మీడియా పాయింట్ వద్ద భావోద్వేగానికి గురయ్యారు.

  • సబితక్క నన్ను మోసం చేశారు.. CM రేవంత్ రెడ్డి

సబితా ఇంద్రారెడ్డి తనను మోసం చేశారని CM రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. ‘2019లో మల్కాజ్గరిలో పోటీ చేయాలని కాంగ్రెస్ నన్ను కోరింది. అక్కడ పోటీ చేస్తే అండగా ఉంటానని సబితక్క మాట ఇచ్చారు. నాకు టికెట్ వచ్చిన వెంటనే KCR మాటలు నమ్మి BRSలో చేరారు. అధికారం కోసం BRSలో చేరి మంత్రి పదవి తీసుకున్నారు. తమ్ముడి లాంటి నన్ను మోసం చేశారు కాబట్టే ఆమెను నమ్మవద్దని KTRకు చెప్పా’ అని CM వివరణ ఇచ్చారు.

  • రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం..

మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి అసెంబ్లీలో అగౌరవపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆ పార్టీ మీర్ పేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. సీఎం మాటలకు నిరసనగా రేపు పెద్ద ఎత్తున్న ఆందోళన చేయాలని ఆయన నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గతం మరిచి మాట్లాడటం సరికాదన్నారు.

Suresh SSM