RAHUL GANDHI: మహిళలకు ఏడాదికి లక్ష.. మేడిన్ తెలంగాణయే లక్ష్యం: రాహుల్ గాంధీ

అప్రెంటిస్ కార్యక్రమం మొదలుపెట్టాలని నిర్ణయించాం. యువతకు ఏడాదికి రూ.లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తాం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో లక్ష రూపాయల జీతం వచ్చేలా చేస్తాం. విద్యావంతులైన యువకులకు సంవత్సరం శిక్షణతోపాటు నెలకు రూ.8,500 ఇస్తాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 6, 2024 | 08:59 PMLast Updated on: Apr 06, 2024 | 9:03 PM

Congress 5 Guarantee Manifesto Released By Rahul Gandhi In Hyderabad Tukkuguda

RAHUL GANDHI: మహిళా న్యాయం ద్వారా పేద మహిళలకు ఏటా రూ.లక్ష రూపాయలు జమచేస్తామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. హైదరాబాద్‌, తుక్కుగూడలో శనివారం సాయంత్రం జరిగిన ‘కాంగ్రెస్‌ జన జాతర’ సభ వేదికగా ‘న్యాయ పత్రం’ పేరుతో కాంగ్రెస్‌ జాతీయస్థాయి మేనిఫెస్టోను రాహుల్ గాంధీ విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ హామీలను వివరించారు. “దేశ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలను ఇచ్చింది. మరో 50 వేల ఉద్యోగాలిస్తాం.

Sajjala Ramakrishna Reddy: షర్మిల పెయిడ్ ఆర్టిస్ట్.. చంద్రబాబుది రాక్షస మనస్తత్వం: సజ్జల

తెలంగాణలో హామీలను అమలుచేసినట్లుగానే.. జాతీయస్థాయిలోనూ కచ్చితంగా అమలుచేసి తీరుతాం. తెలంగాణలో చేసినట్లు దేశ వ్యాప్తంగా కుల గణన చేపడతాం. తెలంగాణ దేశానికి మార్గదర్శకం కావాలి. మేడిన్ చైనా కాదు.. మేడిన్ తెలంగాణయే లక్ష్యం. ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీది కాదు. ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారంటీల పత్రం. జాతీయ మేనిఫెస్టోలో 5 గ్యారంటీలు ఉన్నాయి. అప్రెంటిస్ కార్యక్రమం మొదలుపెట్టాలని నిర్ణయించాం. యువతకు ఏడాదికి రూ.లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తాం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో లక్ష రూపాయల జీతం వచ్చేలా చేస్తాం. విద్యావంతులైన యువకులకు సంవత్సరం శిక్షణతోపాటు నెలకు రూ.8,500 ఇస్తాం. మహిళా న్యాయం ద్వారా ప్రతి పేద కుటుంబంలో ఓ మహిళకు ఏడాదికి రూ.1 లక్ష రూపాయలు అందిస్తాం. ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. ఇకపై దేశంలో ఏ కుటుంబానికి ఏటా రూ.లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండదు.

మోదీ ప్రభుత్వం రైతులకు ఏ న్యాయం చేయలేదు. రైతుకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. కానీ, ధనవంతులకే రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది. కిసాన్ న్యాయం ద్వారా మేం కేంద్రంలో అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేస్తాం. ఎంఎస్ స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంట కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం. కార్మికులకు న్యాయం ద్వారా జాతీయస్థాయిలో కనీస వేతనం రూ.400కి పెంచుతాం. ఉపాధి హామీ కూలీలకు వేతనం పెంచుతాం. దేశంలో 50శాతం జనాభా బీసీలున్నారు. 8శాతం ఎస్టీలు, 15 శాతం దళితులు, 15శాతం మైనార్టీలు ఉన్నారు. మొత్తంగా 90శాతం పేదలే. కానీ, దేశంలో పెద్ద కంపెనీల జాబితా చూస్తే ఈ 90శాతంలో ఒక్కరూ కనిపించరు.

దేశాన్ని నడిపించే 90 మంది ఐఏఎస్‌లలో ముగ్గురు బీసీలు, ఒక గిరిజనుడు, ముగ్గురు మాత్రమే దళితులు ఉన్నారు. జనాభాలో ఓబీసీలు 50శాతం ఉంటే.. ఐఏఎస్‌లలో ఓబీసీల వాటా 3 శాతం మాత్రమే. బడ్జెట్‌లో ఖర్చయ్యే ప్రతి 100 రూపాయలలో కేవలం 6 రూపాయలు మాత్రమే దళితులు, ఆదివాసీలకు ఖర్చు పెడుతున్నారు. కాంగ్రెస్‌ అన్నివర్గాలకు న్యాయం చేస్తుంది. మోదీ వద్ద ధనం, సీబీఐ, ఈడీ ఉంటే.. కాంగ్రెస్‌ వద్ద ప్రేమ, స్వచ్ఛత ఉన్నాయి. ఇదే మా అభిమతం’’ అని రాహుల్‌ అన్నారు.