కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తెలంగాణలో చాలా మందే కష్టపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్లంతా కాంగ్రెస్ గెలుపు కోసం పని చేశారు. కొందరు పార్టీలో చేరి ప్రత్యక్షంగా పని చేస్తే.. కొందరు మాత్రం పార్టీకి దూరంగా ఉంటూనే పరోక్ష సాయం అందించారు. ఇలా పార్టీకి సహాయపడ్డవాళ్లందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవులు దక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యుడు తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్టు పార్టీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పుడు మిగిలింది పార్లమెంట్ ఎన్నకల వంతు. ఈ ఎన్నికల్లో కూడా తెలంగాణలో క్లీన్ స్వీప్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో భువనగిరి పార్లమెంట్ నుంచి తీన్మార్ మల్లన్నను బరిలో దింపబోతున్నట్టు టాక్ నడుస్తోంది. Andhra Pradesh Congress : ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు.. ఏపీ అధ్యక్ష పగ్గాలు వైఎస్ షర్మిలకే..? భువనగిరి పార్లమెంట్‌లో ఏడు నియోజకవర్గాలున్నాయి. అందులో ఒక్క జనగామ మినహా.. అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో ఈ స్థానాన్ని గెలుచుకోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా ఈజీ అవుతుందనే కారణంతో మల్లన్న ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరి పార్లమెంట్‌కు బూడిద బిక్షమయ్య, పొన్నాల లక్ష్మయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, పీవి శ్యాం సుందర్ బీజేపీ నుంచి టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీలో కూడా భువనగిరి టికెట్ కోసం పోటీ గట్టిగానే సాగుతోంది. తీన్మార్ మల్లన్నతో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుభం అనిల్ రెడ్డి కూతురు కీర్తి రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన భార్య లక్ష్మి కోసం భువనగిరి ఎంపీ టికెట్ అడుగుతున్నట్టు తెలుస్తోంది. కానీ వీళ్లందరిలో కూడా తీన్మార్ మల్లన్న పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.