Golden Temple : గోల్డెన్ టెంపుల్ ను సందర్శించిన ఎంపీ రాహుల్ గాంధీ
అమృత్సర్ స్వర్ణ దేవాలయం ను సందర్శించిన కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమృత్సర్లో పర్యటించారు.

అక్కడ తలకు బ్లూ స్కార్ఫ్ ధరించి.. గుర్బానీ కీర్తనను విన్నారు.

మొక్కులు తీర్చుకున్న రాహుల్ గాంధీ

తలకు నీలం రంగు వస్త్రం కట్టుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ప్రార్థనల తర్వాత మందిరంలోని సిక్కుల అత్యున్నత స్థానం అకల్టక్త్ను సందర్శించారు.

స్వర్ణ దేవాలయంలో ఇతరులతో కలిసి స్వచ్ఛంద సేవలో భాగంగా పాత్రలు కడిగాడు.

ఆలయ సిబ్బందితో ముచ్చటించిన రాహుల్ గాంధీ

రాహుల్ పంజాబ్ పర్యటన వ్యక్తిగతం అని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారు.

ఆధ్మాత్మిక సందర్శన, దైవ చింతన కోసం రాహుల్ పంజాబ్ వచ్చారని.. ఇదీ వ్యక్తిగత పర్యటన అని.. అతని ప్రైవసీని గౌరవిద్దాం అని.. రాహుల్ పర్యటనకు కార్యకర్తలు హాజరు కావొద్దని సూచించారు.

భక్తులు సేవించిన పాత్రలు కడిగుతు ఆలయ సేవలో పాల్గొన్నారు.

భక్తులకు తాగునీరు పంపిణీ చేసిన ఎంపీ రాహుల్ గాంధీ

భక్తులకు తాగునీరు పంపిణీ చేసిన ఎంపీ రాహుల్ గాంధీ

'కర సేవ'లో పాల్గొని భక్తులకు ప్రసాదాలు వడ్డించిన రాహుల్ గాంధీ

ఇది కేవలం ఆధ్మాత్మిక సందర్శన మాత్రమే.. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్.